కీర్తి సురేష్ కి బంపర్ ఆఫర్.. ఆ బాలీవుడ్ హీరో సినిమాలో ఛాన్స్?

praveen
సౌత్ ఇండస్ట్రీలో మహానటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది కీర్తి సురేష్. టాలీవుడ్ లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది కీర్తి సురేష్. తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఇప్పటికే సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది.

 ఏకంగా నేటి తరానికి మహానటి సావిత్రి ఎవరు అంటే కీర్తి సురేష్ అని సినీ నేటి ప్రేక్షకులు అనుకునే విధంగా ఇక తన నటనతో ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే మహానటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొన్నాళ్లపాటు ఇక లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి వరుస ప్లాపులతో సతమతమైంది ఈ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. గత కొంతకాలం నుంచి మాత్రం ఈ అమ్మడికి సౌత్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇక ఇలా దొరికిన ఖాళీ సమయాన్ని బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉపయోగించుకుంటుంది. అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ అనే మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట కీర్తి సురేష్ ,ప్రియదర్శన్ దర్శకత్వంలో దొరికేకుతున్న చిత్రంలో ఆమె ఎంపికైనట్లు ఒకటాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. అయితే ఇదే నిజమైతే ఇక ఈ అమ్మడు బాలీవుడ్ లో పాగా వేయడం ఖాయమని సినీ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: