బ్యాడ్ లక్ అంటే ఇదే.. అదే జరిగితే ఆర్సిబి డౌటే?

praveen
2024 ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంత భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్ గానే ఉంటుంది బెంగళూరు టీమ్. కానీ ఇక చెత్త ప్రదర్శన చేసి నిరాశ పరుస్తూ ఉంటుంది.  కానీ ఈ ఏడాది ఎందుకో బెంగుళూరు టీం తప్పకుండా టైటిల్ గెలిచి తీరుతుందని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్మారు. ఎందుకంటే ఐపీఎల్ కంటే ముందు జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సిబి మహిళల జట్టు టైటిల్ విజేతగా నిలిచింది.

 దీంతో ఇక ఐపీఎల్లో కూడా కోహ్లీ సేన అద్భుతంగా రానించి మొదటి టైటిల్ అందుకుంటుంది అని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్మారు. ఈ క్రమంలోనే మునుపటితో పోల్చి చూస్తే కాస్త ఎక్కువ అంచనాలతోనే ఈ సీజన్లో బరిలోకి దిగింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. కానీ వరుస ఓటములతో సతమతమై చివరికి అందరినీ నిరాశ పరిచింది. చివరికి కనీసం ప్లే ఆఫ్ లో కూడా అడుగుపెట్టకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది అని అనుకుంటున్న సమయంలో.. మళ్లీ వరుస విజయాల బాట పట్టింది. దీంతో పాయింట్లు పట్టికలో చివరన కొనసాగిన ఆర్సిబి ఇప్పుడు ఐదవ స్థానానికి ఎగబాకింది.

 అయితే ఇక ఆర్సిబి మరో మ్యాచ్ ఆడాల్సి ఉండడంతో.. ఇక ఈ మ్యాచ్ లో అత్యధిక తేడాతో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే ఛాన్సులు ఇంకా ఉన్నాయి. కానీ ఇప్పుడు వరుస విజయాలతో జోరు మీద ఉన్న ఆర్సీబీకి వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్లే ఆఫ్ చేరేందుకు కీలకంగా ఉన్న చివరి మ్యాచ్ జరిగే శనివారం రోజున వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. కర్ణాటకలో ద్రోనీ ప్రభావం ఉండడంతో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ ఆర్సీబీ మ్యాచ్ రోజు కూడా వర్షం కురిసి మ్యాచ్ రద్దు అయితే ఇక ఆ జట్టు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు  అయినట్లే. మరోవైపు సీఎస్కే ఆశలు ఇతర జట్ల ప్రదర్శన పై ఆధారపడి ఉంటాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: