ఆంధ్రాలో జగన్‌ చేసే అభివృద్ధి వారికి కనిపించదా?

1956నుండి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు కేవలం 11కాలేజీలు మాత్రమే ఉన్నాయి. సుమారుగా 65ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి కొత్త మెడికల్ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. అది కూడా ఒకటి, రెండూ కాదు ఏకంగా ఒక్కసారే ఐదు మెడికల్ కాలేజీలు సిద్ధమవుతూ ఉండడం  గొప్ప విశేషం. ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సాకారం అవుతున్న స్వప్నం. లెక్క ప్రకారం చూసుకుంటే జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదన.

ఆల్రెడీ తెలంగాణలో కూడా మెడికల్ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కలిపి లెక్కేస్తే మొత్తం 14కొత్త మెడికల్ కాలేజీలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణలో కేసీఆర్ పాలన గురించి పాజిటివ్ గానే రాయాల్సి ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసరికి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తున్నా కూడా వాటిని ఇక్కడ మీడియా హైలైట్ చేయడం పక్కనపెట్టి అసలు వాటి గురించే ప్రస్తావించదు.

ఒకవేళ ఈ మెడికల్ కాలేజీల ప్రస్తావన వస్తే కనుక సాక్షి మీడియాలోనే రావాలి అంతే. ఎందుకంటే ఎవరు గొప్ప వాళ్లే చెప్పుకోవాలి తప్ప ఇక్కడ మరొకరి  గొప్పను చెప్పే అలవాటు ఉండదు ఇక్కడి మీడియాకి. ప్రస్తుతం తెలంగాణలో 30కి పైగా జిల్లాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రాలో 26 జిల్లాలు ఉన్నాయి. రాబోయే కాలంలో ఆంధ్రాలో మరో 17 మెడికల్ కాలేజీలు వస్తే, తెలంగాణలో 18మెడికల్ కాలేజీలు రాబోతున్నాయని తెలుస్తుంది.

దీనివల్ల ఆర్థికంగా స్తోమత లేని విద్యార్థులకు మెడిసిన్ చదువుకోవడానికి ప్రభుత్వం ఒక ఊతం ఇచ్చినట్లు అవుతుంది. వీటితో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా పెడతారని తెలుస్తుంది. వీటివల్ల పేద, గిరిజన తెగలకు చెందిన ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. వైద్య విద్యలో 100ఏళ్ల రికార్డు ఏమిటంటే ఇప్పటివరకు 2,185ఎంబిబిఎస్ సీట్లు ఉంటే ఈ నాలుగేళ్లలో 2550కొత్త సీట్లు వచ్చాయి. వాస్తవంగా అయితే 16,852కోట్లతో 17కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని చూస్తుందట కేంద్ర ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: