ఆదాయంలో అదరగొడుతున్న కేసీఆర్‌?

భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అన్ని దేశాల కంటే మెరుగ్గా పయనిస్తోంది. అయినా ఇండియాలోని ప్రతిపక్షాలు మాత్రం ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నామని చెబుతున్నారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అయిదో ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఎక్కోడ ఉండే భారత్ ఆర్థిక వ్యవస్థలో చాలా దృఢంగా మారిపోయింది. అదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఆర్థికంగా మంచి జోరు మీద ఉన్నాయి.

దేశంలో ఈ ఆగస్టు నెలలో దేశ జీఎస్టీ 11 శాతం వృద్ధిలో నడుస్తుంది. దాదాపు 1.59 లక్షల కోట్లుగా పెరిగింది. గతేడాది.. 1.46 లక్షల కోట్లు వస్తే ఈ ఏడాది అది 1.59 లక్షల కోట్లకు చేరుకుంది. ఆగస్టు నెలకు సంబంధించి తెలంగాణ జీఎస్టీ వసూళ్లు.. వార్షిక వృద్ధి 13 శాతం పెరిగింది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే చాలా మెరుగుపడింది. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ నుంచి పోల్చుకుంటే 10 శాతం పెరిగింది. 3479 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చుకుంటే 10 శాతం పెరిగింది.

తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో గత ఆగస్టులో రూ. 3871 కోట్లు ఉంటే ప్రస్తుతం అక్కడ 4393 కోట్లుగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3173 కోట్ల జీఎస్టీ ఉంటే.. ప్రస్తుతం 3493 కోట్లకు పెరిగింది. అయితే ఎఫ్‌ఆర్బీఎం నిబంధనల ప్రకారం... డబ్బులు ఇచ్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా నిందలు వేస్తున్నారు. ఆదాయం ఆధారంగా లోన్లు తీసుకునే అవకాశం ఉంటుంది. జీఎస్టీ వసూళ్ల ప్రకారం.. అప్పులు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు.

ఇలా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా మెరుగుపడుతుంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలు కూడా చాలా వరకు జీఎస్టీ వసూళ్లలో ముందంజలోనే ఉన్నాయి. కానీ వీటన్నింటినీ పరిగణలోకి  తీసుకోని ప్రతిపక్షాలు కేవలం రాజకీయాలు చేయడం కోసం విమర్శలు చేస్తున్నాయి. దీనికి తోడు తమ అధీనంలోనే ఉండే పత్రికలు, మీడియా సంస్థలు విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: