ఇండియా టుడే సర్వేతో టీడీపీలో సంబరాలు?

ఇండియా టుడే సంస్థపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇండియా టుడే సంస్థ అనేది ఒక విశ్వాస పాత్రమైన సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు ఇచ్చిన ఒక సర్వే రిపోర్టు ఆంధ్ర రాష్ట్రంలో సంచలనం అవుతున్న సందర్భం ఇది. అసలు అన్ని సంస్థల సర్వేలు ఒక ఎత్తైతే, ఇండియా టుడే సర్వే ఒక్కటే ప్రత్యేకించి ఒక ఎత్తు. ఇప్పుడు ఇండియా టుడే టిడిపిపై ఇచ్చిన ఒక సర్వే నివేదిక ఆ పార్టీలో సంతోషాన్ని నింపుతుంది.

ఒక రకంగా టిడిపికి నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది అది. ఆ సంస్థ ఇచ్చిన సర్వే సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సర్వే కాకపోయినా సరే అది టిడిపి వాళ్లకి సంతృప్తినిచ్చింది.‌ మహారాష్ట్రకి సంబంధించిన విషయం  ప్రస్తావిస్తూ ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీలకు ఓట్ల శాతం ఏ రకంగా ఉంటుందనేది చెప్పుకొచ్చింది ఇండియా టుడే. దాని సర్వే ప్రకారం ఎన్డీఏ కి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి 281సీట్లు వస్తాయని తెలుస్తుంది.

ఆ తర్వాత ఎన్డీఏ కూటమిలో  సభ్యత్వం గల ఏ పార్టీకి కూడా రెండు అంకెల  స్థానాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్లు మూడ్ ఆఫ్ ది నేషన్ డిబేట్ లో పార్టిస్పేట్ చేయడం జరిగింది ఈమధ్య. దాంట్లో బిజెపి ప్రతినిధి మాట్లాడుతూ  తమ భాగస్వామ్య పార్టీలలో ప్రతీ ఒక్కరు కూడా రెండు అంకెల స్థానాలు సాధిస్తారని అన్నారట.

అయితే దానికి ఆ ఇండియా టుడే ప్రతినిధి మాట్లాడుతూ ఎవరున్నారు ఆ విధంగా అని అడిగితే మహారాష్ట్రలో శివసేన షిండే వర్గం గతంలో ఉద్ధవ్ దాకరేతో కలిసినప్పుడు ఎన్ని స్థానాలు వచ్చాయో ఇప్పుడు కూడా అన్నే వస్తాయని అన్నారట. అయితే దానికి ఇండియా టుడే ప్రతినిధి మీ ముగ్గురికి కలిపితే 20సీట్లు రావచ్చని, అయితే ఒక్క టిడిపికే 15సీట్లు వరకు వస్తాయని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: