మా అమ్మనాన్న వల్లే.. చాలా చాన్స్ లు పోయాయ్ : మృనాల్

praveen
నేటి రోజుల్లో సోషల్ మీడియా సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య దూరాన్ని పూర్తిగా తగ్గించేసింది. ఒకప్పుడు సినీ సెలబ్రిటీలను చూడాలి అంటే ఎక్కడో షూటింగ్ జరుగుతున్న దగ్గరికి వెళ్లి దూరం నుంచి చూసి ఆనంద పడిపోయేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా తమ అభిమాన నటీనటులతో సోషల్ మీడియా ద్వారా నేరుగా మాట్లాడటం చేస్తూ ఉన్నారు. అంతేకాదు తాము అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ కూడా అడిగేస్తున్నారు అని చెప్పాలి.

 ఎప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో దగ్గరగానే ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ ఫోటోలను ఎప్పుడూ ఆన్లైన్లో పోస్ట్ చేయడమే కాదు ఇక తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు సినీ సెలబ్రిటీలు చెప్పే విషయాలు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న మృణాల్ ఠాగూర్ కూడా తన కెరియర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

 సాధారణంగా అయితే ఇండస్ట్రీలోకి రావడానికి తమ అమ్మానాన్న కారణమని వాళ్ళ సపోర్ట్ కారణంగానే తాను ఈ స్థాయిలో ఉండగలిగాను అంటూ హీరోయిన్లు చెప్పడం చూస్తూ ఉంటాం. కానీ మృణాల్ ఠాగూర్ మాత్రం మా పేరెంట్స్ కారణంగానే ఎన్నో చాన్సులు పోయాయి అంటూ షాకింగ్ విషయం చెప్పింది. ముద్దు సీన్స్ ఉన్న సినిమాలో తాను నటించేందుకు తల్లిదండ్రులు అంగీకరించేవారు కాదు అంటూ మృణాల్ ఠాగూర్ తెలిపింది. ఆ కారణంగా తాను చాలా అవకాశాలను కోల్పోయాను అంటూ వెల్లడించింది. నటిగా అక్కడ సన్నివేశం కథ తాలూకు అవసరాన్ని చూడాల్సి ఉంటుంది. ముద్దు సన్నివేశం ఉందని సినిమాలు వదులుకుంటూ వెళ్తే ఇక సినిమాలు చేయడం కష్టం. ఇదే విషయాన్ని మా పేరెంట్స్ కి అర్థం అయ్యేలా చెప్పాల్సి వచ్చింది అంటూ మృనాల్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: