మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
సుహాస్ మాట్లాడుతూ .. ‘‘మండాడి’ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు, ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. నవీన్ గారితో కలిసి ఈ మూవీని చూశాను. సినిమా చూసిన రోజే బ్లాక్ బస్టర్ అని నవీన్ గారు చెప్పారు. మేం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. సూరి అన్న ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. మహిమ గారి గురించి, రవింద్ర గురించి అందరూ చెబుతున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మదిమారన్ గారికి థాంక్స్. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
మైత్రి నవిన్ మాట్లాడుతూ .. ‘‘మండాడి’ చూసిన వెంటనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మాను. ఈ మూవీ హిట్ అవుతుందని సుహాస్‌కి కూడా ముందే చెప్పాను. సూరి గారి స్క్రిప్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ ఎక్కువగా ఉండబోతోన్నాయి. ‘మండాడి’ని అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు.
మైత్రి రవి మాట్లాడుతూ .. ‘‘మండాడి’ సినిమాని ఎనిమిది నెలల క్రితం ఓ బిజినెస్ కట్ చూశాం. వెంటనే శశిని పంపించి బిజినెస్ క్లోజ్ చేశాం. అప్పటికి మూవీ ఇంకా పూర్తి కాలేదు. కానీ ఇప్పుడు మా నమ్మకం నిజమైంది. ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఈ ఏడాదిలో మాకు ఇదొక బిగ్గెస్ట్ హిట్. సుహాస్, సూరి సీన్లు, బోట్ సీక్వెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. టీం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. ఈ సినిమా మరింత విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘మండాడి’ కంటెంట్ ఓరియెంట్ సినిమా. ఇలాంటి చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తున్నారని మాకు ముందే తెలుసు. ప్రతీ చోట నుంచి మాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. డిస్ట్రిబ్యూటర్లంతా సంతోషంగా ఉన్నారు. నా ‘రంగం’ చిత్రంలానే ‘మండాడి’కి మంచి ఆదరణ దక్కుతోంది. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మైత్రి టీంకు థాంక్స్. మదిమారన్ ఈ మూవీని గొప్పగా తీశారు. సూరి, సుహాస్, మహిమ అందరూ మాకు సపోర్ట్ చేశారు. పీటర్ హెయిన్ గారి సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేం. మా సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు మదిమారన్ పుగళేంది మాట్లాడుతూ .. ‘‘మండాడి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు సెలెబ్రేట్ చేస్తున్నారు. అన్ని చోట్లా మా మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాకి భాషా హద్దులు, సరిహద్దులు ఉండవని మరోసారి ఆడియెన్స్ నిరూపించారు. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్’ అని అన్నారు.
మైత్రి శశి మాట్లాడుతూ .. ‘‘మండాడి’ లాంటి మంచి చిత్రాన్ని మాకు ఇచ్చిన ఎల్రెడ్ కుమార్ గారికి థాంక్స్. ఈ మూవీని చూసిన వెంటనే హిట్ అవుతుందని అనుకున్నాం. డే వన్‌కే చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. మూడో రోజుకి వంద స్క్రీన్లు పెంచాం. మున్ముందు ఈ సినిమా ఇంకా వండర్స్ క్రియేట్ చేస్తుంది. సూరి గారు, సుహాస్ గారు అద్భుతంగా నటించారు. డిస్ట్రిబ్యూటర్లంతా హ్యాపీగా ఉన్నారు’ అని అన్నారు.
మహిమా నంబియార్ మాట్లాడుతూ .. ‘‘మండాడి’ హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు. అయితే ఇంత ప్రేమ లభిస్తుందని ఊహించలేదు. అన్ని భాషల్లో మాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బోట్ రేస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలా ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడుతూ .. ‘మంచి సినిమాని తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ‘మండాడి’ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. ఇలాంటి ఓ గొప్ప సినిమాలో పార్ట్ అయినందుకు గర్వంగా ఉంది’ అని అన్నారు.