కోహ్లీ స్ట్రైక్ రేట్ పై విమర్శలు.. గంభీర్ కీలక వ్యాఖ్యలు?

praveen
17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి అభిమానులు అందరిని నిరాశపరిచేందుకు సిద్ధమైంది. 17వ సీజన్లో అయినా టైటిల్ గెలుస్తుందని అభిమానులు నమ్మకం పెట్టుకోగా.. ఎప్పటిలాగానే మరోసారి నిరాశపరచబోతుంది. ఎందుకంటే వరుసగా ఓటములతో సతమతమవుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఆర్సీబీ జట్టుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా కోల్పోయింది అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆర్సిబిని ప్లే ఆఫ్ లో చూడలేం.

 అయితే జట్టులో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ చెత్త ప్రదర్శనలతో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. బ్యాటింగ్ విభాగం పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగం మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక ఓటములతో పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది బెంగుళూరు జట్టు  అయితే ఆ జట్టు గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా అటు విరాట్ కోహ్లీ మాత్రం భారీగా పరుగులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే  ప్రస్తుతం ఈ సీజన్లో టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు  ఇప్పటికే 500 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

 అయితే ఇలా విరాట్ కోహ్లీ జట్టును గెలిపించేందుకు భారీగా పరుగులు చేస్తున్నప్పటికీ అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ విమర్శలపై కోల్కతా జట్టు మెంటర్గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్  స్పందించాడు. ఒక్కో ప్లేయర్ ఒక్కోల ఆడుతాడు. మాక్స్ వెల్ చేయగలిగింది కోహ్లీ చేయలేరు. కోహ్లీ చేసేది మ్యాక్స్ వెల్ చేయలేడు. ఏ టీంలోనైనా విభిన్నమైన ఆటగాళ్లు ఉండాలి. అందరూ ఎక్స్ క్లోజ్ బ్యాటర్లు ఉంటే స్కోర్ 300 చేయొచ్చు. లేదంటే 30 కే ఆల్ అవుట్ అవ్వచ్చు. జట్టు ఓడినప్పుడే విమర్శలు వస్తాయి. గెలిస్తే ఎవరు ఏం పట్టించుకోరు అంటూ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: