ఏంటి మహేష్ బాబు వల్ల బాలకృష్ణ మాత్రమే కాకుండా ఆ హీరో కూడా నష్టపోయారా.. ఇంతకీ మహేష్ బాబు వల్ల నష్టపోయిన మరో హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే అఖండ-2 మూవీ వాయిదా పడడం గురించే మాట్లాడుకుంటున్నారు. అఖండ-2 మూవీ నిర్మించిన 14 రీల్స్ బ్యానర్ కి ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ కి మధ్య ఆర్థిక లావాదేవీల ఇష్యూ గత కొద్ది సంవత్సరాలుగా నడుస్తుందట. ఇప్పటివరకు 14 రీల్స్ బ్యానర్ వాళ్ళు ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్లకి దాదాపు 28 కోట్లు ఇవ్వాల్సి ఉందట.కానీ ఇప్పటివరకు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో చివరికి చేసేదేమీ లేక అఖండ-2 మూవీని విడుదల కాకుండా అడ్డుకొని కోర్టులో కేసు వేశారు. దాంతో అఖండ-2 మూవీ ఆగిపోయింది.
అయితే మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే, ఆగడు వంటి రెండు సినిమాలు ప్లాఫ్ అవ్వడంతో ఆ సినిమాల వల్ల వచ్చిన నష్టాన్ని 14 రీల్స్ బ్యానర్ ఇప్పటివరకు ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి చెల్లించకపోవడంతో ఈ వివాదం మొదలైంది.దాంతో బాలకృష్ణ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.దీంతో చాలామంది నందమూరి అభిమానులు మహేష్ బాబు వల్లే బాలకృష్ణ సినిమాకి తిప్పలు వచ్చాయి అంటూ మహేష్ బాబుని ఏకిపారేశారు. అయితే మహేష్ బాబు వల్ల కేవలం బాలకృష్ణనే కాదట మాస్ మహారాజా రవితేజ కూడా నష్టపోయారట.అదేలా అంటే మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ అందరూ చూసే ఉంటారు. భారీ అంచనాలతో వచ్చి ప్లాఫ్ అయింది. అయితే ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మించారు..
అయితే ఈ సినిమా ప్లాఫ్ అవ్వడంతో చాలావరకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు. ఇక నష్టపోయిన డబ్బు ఇవ్వకుండా ఠాగూర్ మధు సైలెంట్ అయిపోయారు.ఎన్ని రోజులు అడిగినా ఇవ్వకపోవడంతో చివరికి ఠాగూర్ మధు నిర్మించిన క్రాక్ సినిమాకి అడ్డుపడ్డారు. మా నష్టాలను పూడ్చకుండానే మరో సినిమాని ఎలా రిలీజ్ చేస్తారని కోర్టుకెక్కారు. దాంతో రవితేజ నటించిన క్రాక్ సినిమా ఆగిపోయింది. చివరికి ఆర్థిక లావాదేవీల ఇష్యూ క్లియర్ అయ్యాక రవితేజ మూవీ విడుదలైంది.అలా మహేష్ బాబు స్పైడర్ మూవీ వల్ల రవితేజ క్రాక్ మూవీకి ఇబ్బందులు వచ్చాయి. అయితే క్రాక్ మూవీ వాయిదా పడి మళ్లీ రిలీజ్ అయినప్పటికీ మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా మహేష్ బాబు ప్లాప్ సినిమాల వల్ల బాలకృష్ణ తో పాటు రవితేజ కూడా నష్టపోయారట.