అఖండ 2: వివాదంపై.. నిర్మాత సురేష్ బాబు అలాంటి వ్యాఖ్యలు..!

Divya
బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా అఖండ 2. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈరోజు థియేటర్లో బాలయ్య అభిమానుల మధ్య అఖండ 2 కొనసాగుతూ ఉండేది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా వాయిదా పడినట్లుగా నిర్మాతలు సైతం తెలిపారు. ఈ విషయం పైన తాజాగా ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.


నందు హీరోగా నటిస్తున్న సైక్ సిద్ధార్థ సినిమాని సురేష్ బాబు విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్నటి రోజున నిర్వహించిన ఒక ఈవెంట్లో  సురేష్ బాబుకు అఖండ 2 సినిమా వాయిదా గురించి యాంకర్ ప్రశ్నించగా? ఈ విషయం పైన సురేష్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా ఫైనాన్షియల్  ఇష్యూ పైన  ఇన్ని వార్తలు రావడం చాలా దురదృష్టకరం. కానీ సినిమా మాత్రమే చూడాలనుకోనే అభిమానులకు ఇలాంటి విషయాలు అవసరం లేదని తెలిపారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని తెలియజేశారు.


తాను కూడా ఈ విషయం క్లియర్ చేయడానికి వెళ్లాను అందుకే నాకు ఇక్కడికి రావడానికి ఆలస్యం అయ్యిందని, అఖండ 2 సినిమా సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందంటూ తెలియజేశారు. ముఖ్యంగా ఇవన్ని ఫైనాన్షియల్ విషయాలు కాబట్టి ఓపెన్ గా మాట్లాడడం కుదరదు. కానీ దురదృష్టవశాత్తు బిజినెస్ వ్యవహారాల గురించి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాస్తూ వైరల్ చేస్తున్నారని, చాలామంది సినిమాలకు ప్రాబ్లమ్స్ ఇవే అంటూ ఏవేవో రాస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు? ఆడియన్స్ సినిమా చూడాలనుకుంటారు! కానీ మీరు ఎందుకు ఇవన్నీ వాళ్ళకి చెబుతూ ఉంటారు.. గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు చాలా సినిమాలకే వచ్చాయి. ఈ సమస్యకు పూర్తి పరిష్కారం దొరకాలని కోరుకుంటున్నానని తెలిపారు సురేష్ బాబు. ప్రస్తుతం సురేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలకు బాలయ్య అభిమానులు సమర్ధిస్తూ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: