అద్భుతమైన అందం , ఆకట్టుకునే నటన , స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసుకొని ఫిజిక్. అన్నీ ఉన్న ఓ తెలుగమ్మాయి సినిమాల్లో కంటే కూడా వెబ్ సిరీస్లలో నటిస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి ఈషా రెబ్బ. ఈమె నటిగా కేరిర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది. ఈమె కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎక్కువ శాతం చిన్న సినిమాల్లోనే నటిస్తూ వచ్చింది.
కొంత కాలం క్రితం ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అరవింద సమేత అనే మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో , ఈ మూవీ ద్వారా ఈ నటికి భారీ స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్లలో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇప్పటి వరకు ఈమె చాలా వెబ్ సిరీస్లలో నటించింది. అలాగే ఈమె నటించిన వెబ్ సిరీస్లలో కూడా చాలా వరకు ప్రేక్షకులను భారీగా ఆకట్టుకున్నాయి. ఈమె కొంత కాలం క్రితం 3 రోజెస్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా 3 రోజెస్ సీజన్ 2 అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇకపోతే ఇషా రెబ్బ సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.