టాలీవుడ్ నటుడు ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా కాలం క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈయన ప్రేమ కావాలి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీతోనే ఈయన మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన లవ్ లీ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు మూవీ లతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ రెండు సినిమాల తర్వాత మాత్రం ఈయన నటించిన ఏ మూవీ కూడా విజయాన్ని అందుకోలేదు.
ప్రస్తుతం ఆది సాయి కుమార్ "శంబాల" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ యొక్క నాన్ థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 10 కోట్ల ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వార్త కూడా వైరల్ అవుతుంది.
తాజాగా ఈ మూవీ కి సంబంధించిన నైజాం థియేటర్ హక్కులను ఒక స్టార్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ మూవీ యొక్క నైజాం థియేటర్ హక్కులను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడం , ఈ మూవీ నైజాం థియేటర్ హక్కులను మైత్రి సంస్థ ద్వారా దక్కించుకోవడంతో ఈ సినిమాకు మంచి టాక్ వస్తే నైజాం ఏరియాలో ఈ సినిమాకి సూపర్ సాలిడ్ కలెక్షన్స్ దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.