ఏపీ: కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ని ఉతికారేసిన పవన్ కళ్యాణ్?

Suma Kallamadi
ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ వైస్సార్సీపీ అధినేత జగన్ ని కడిగి పారేసారు. ఏపీలో కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా, వైసీపీ నేతలు కుట్ర చేశారని పవన్ ధ్వజమెత్తారు. అయితే రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్ కు కాపు నాయకులు ఎందుకు అండగా నిలబడ్డారో వారి విజ్ఞతకే వేదిలేస్తున్నానని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు పవన్. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో వైసీపీ నాయకులకు రిజర్వేషన్లు రావని ముందే తెలుసని, కానీ కావాలనే కాపులను మోసం చేయాలని, ఎగదోయాలని పన్నాగం పన్నారని అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
2014లో జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమం కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతికి చెందిన కరుణాకర్ రెడ్డి వంటి నాయకుల సమక్షంలో జరిగిందని, వారికి రిజర్వేషన్ రాదని తెలిసినా కాపులను కావాలని వారి అవసరానికి అనుగుణంగా పావులా వాడుకున్నారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆరోపించారు. ఏ ఉద్యమం అయినా ఒక దశ దిశతో అహింసాయుతంగా ముందుకు వెళ్లాలి. సమాజంలో ఉన్నవారందరని ఉద్యమం ప్రభావితం చేయాలి. కానీ ఇలాంటి స్వార్ధ పూరిత రాజకీయాలకోసం కాపు రిజర్వేషన్ ఉద్యమం లేపి కిరాయి మూకలను పెట్టి వైసీపీ మూకలే దగ్గరుండి ట్రైన్ తగలబెట్టి గవర్నమెంట్ వాసులను ధ్వంసం చేసారని ఆరోపించారు.
అయితే ఈ నేపథ్యంలో కిరాయిమూకలు చేసిన పనికిమాలిన పనికి అమాయకులైన కాపు యువత కేసులు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావచ్చు... అందరూ కలిసి పోరాడి దాన్ని సాధించుకున్నారని, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారని చెప్పారు. మంద కృష్ణ మాదిగ దాదాపు 2 దశాబ్దాల పాటు సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ రోజు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని అతనికి మద్దతు తెలిపారని, ఒక కుల ఉద్యమం అయినా, రాష్ట్ర ఉద్యమం అయినా త్రికరణ శుద్ధిగా పనిచేయాలని హితవు పలికారు. లేకపోతే సమాజంలో అమాయకులైన యువత కల్లబొల్లి మాటలకు బలైపోతారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: