సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మరో బిగ్ ట్విస్ట్
తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది.
ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపుల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత రోజు మద్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చారు.
అయితే తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో మరో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పుష్ప 2 ప్రీమియర్ షోకు హీరో, హీరోయిన్, చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరారు. కానీ హీరో, హీరోయిన్ స్పెషల్ షోకు రావడంతో క్రౌడ్ విపరీతంగా ఉంటుందని పోలీసులు చెప్పారు. అలాగే వారు రావొద్దని థియేటర్ యాజమాన్యానికి రాత పూర్వకంగా చిక్కడపల్లి పోలీసులు సమాచారం ఇచ్చారు. అయినా సఐకన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసుల మాట వినకుండా వచ్చి, అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారు. రేవతి మృతి తర్వాత అల్లు అర్జున్‌ను బయటికి పంపించగా.. వెళ్లే సమయంలో కూడా బన్నీ కారు ఎక్కి ర్యాలీగా అభిమానులకు అభివాదం తెలిపారు. దానికి సంబంధించిన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హైకోర్టు మధ్యంతర బెయిల్ ద్వారా బయటికి వచ్చిన అల్లు అర్జున్.. రిమాండ్ వాదనల సమయంలో ఇదే అంశాన్ని పీపీ కోర్టుకు తెలిపారు. పోలీసులు రిలీజ్ చేసిన లెటర్ తో అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ అయే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.