దివంగత శ్రీదేవి చెల్లెలు ఎవరో తెలుసా ? స్టార్ హీరోయిన్ అవ్వాలని వచ్చి మధ్యలో కనబడకుండా పోయింది..?
శ్రీదేవి ఏకంగా తన సినీ కెరియర్లో 300 పైగా సినిమాలో నటించారు .. అయితే శ్రీదేవి గురించి చాలామందికి తెలుసు కానీ శ్రీదేవి చెల్లి గురించి మాత్రం చాలా మందికి తెలియదు. శ్రీదేవి సోదరి పేరు శ్రీలత .. శ్రీలతకి శ్రీదేవికి మధ్య మంచి బాండింగ్ ఎంతో గట్టిగా ఉండేది .. ఒక్కరంటే ఒకరికి ఎంతో ఇష్టం కానీ వాళ్ళిద్దరి మధ్య పలు గొడవలు జరగటంతో ఇద్దరూ దూరం అయిపోయారు .. శ్రీలత కూడా నటే.. ఆమె 1972 నుంచి 1993 వరకు చిత్ర పరిశ్రమలో పనిచేశారు .. శ్రీదేవి నటించిన అన్ని సినిమాల్లో కూడా ఆమె నటించేవారు .. అయితే శ్రీదేవిలా ఆమె సక్సెస్ కాలేకపోయారు.. తర్వాత కొన్ని రోజులు ఆమె శ్రీదేవికి మేనేజర్ గా కూడా ఉన్నారు.
అదే సమయంలో శ్రీదేవి తల్లి మరణం తర్వాత వారిద్దరి మధ్య పలు విభేదాలు వచ్చాయని అంటారు. శ్రీదేవి తల్లి హాస్పటల్లో ఉన్న సమయంలో ఆపరేషన్ లో తప్పు జరగడంతో హాస్పటల్ మీద కంప్లైంట్ ఇచ్చింది శ్రీదేవి .. ఆ సమయంలో ఆ కేసులో శ్రీదేవి గెలవగా ఏడు కోట్ల రూపాయలు ఆమెకు వచ్చాయి .. వాటిని తీసుకునేందుకు శ్రీదేవికి తన సోదరి మధ్య గొడవలు జరిగాయని అంటారు.. ఆ తర్వాత శ్రీదేవి మీద శ్రీలత కేసు కూడా వేశారు.. శ్రీదేవి తల్లి మానసికంగా బాగోకపోవడంతో ప్రాపర్టీని శ్రీదేవి పేరు మీద రాసేసిందని శ్రీలత కంప్లైంట్ చేయగా.. శ్రీలత కేసులో గెలవడంతో రెండు కోట్ల రూపాయలని ఆమెకి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా వీళ్ళ మధ్య పలు విభేదాలు వచ్చాయి.