యష్మీతో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన గౌతమ్.. ఏమన్నారంటే..?

Divya
గౌతమ్.. బిగ్ బాస్ సీజన్ 7లో దాదాపు 13 వారాలపాటు కొనసాగి టైటిల్ విజేతగా నిలవలేకపోయారు. కానీ ఈసారి టైటిల్ రేస్ లో దిగి సీజన్ 8 విన్నర్ గా నిలవబోతున్నారు అంటూ అందరూ కామెంట్ చేశారు. కానీ ఆయన రన్నర్ గా నిలిచారు. ఇకపోతే బిగ్ బాస్ షో అనంతరం బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హాజరైన గౌతమ్ యష్మితో రిలేషన్షిప్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే గౌతమ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చిన రెండవ వారంలోనే ఎలిమినేట్ కావాల్సింది. కానీ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ కి వెళ్లడంతో గౌతమ్ కాస్త సేవ్ అయిపోయారు.ఓటింగ్ లో జోరు చూపించాడు. ఈ క్రమంలోనే హౌస్ లో యష్మితో లవ్ ట్రాక్ కోసం ప్రయత్నించాడు. ప్రారంభంలో ఆమె కాస్త దూరం పెట్టినా,  ఆ తర్వాత ఆయనకు దగ్గర అయింది. ఆ సమయంలోనే తన ఫీలింగ్స్ కూడా బయట పెట్టాడు గౌతమ్. కానీ తనకు ఆ ఫీలింగ్ లేదని చెప్పింది. ఒక ఫ్రెండ్ గానే చూస్తున్నట్టు తెలిపింది. ఇక తర్వాత దూరం పెట్టింది. మొత్తానికి యష్మీ ప్రవర్తన నచ్చకపోవడంతో గౌతమ్ కూడా ఆమెను దూరం పెట్టేసి, ఒక నామినేషన్స్ లో ఏకంగా అక్క అంటూ సంబోధించి ఆమెకు కోపం వచ్చేలా చేశాడు. ఇది కాస్త అప్పుడు పెద్ద రచ్చ అయ్యింది.
ఇక దీనిపై గౌతమ్ మాట్లాడుతూ.. శుభశ్రీ తో ఫ్రెండ్ గా స్టార్ట్ అయ్యాను. అది కాస్త పెరిగింది. అది మరింత పెరిగే క్రమంలోనే ఆమె ఎలిమినేట్ అయిపోయింది. దీంతో అక్కడితో మా బంధం కూడా కట్ అయింది. ఈ ఏడాది నాకు నిజమైన ప్రేమ దొరకలేదు. ఆ ఎమోషన్స్ మాత్రం ఉండిపోయాయి. హౌస్ లో యష్మి పై ఆ ఫీలింగ్స్ కలిగాయి. అయితే ఆమెకు అది ఇష్టం లేదని చెప్పడంతో నేను కూడా బ్యాక్ అయ్యాను అంటూ గౌతం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: