అవి నా కెరియర్లో చీకటి రోజులు.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో పైకి కనిపించినంత అందంగా సినీ సెలబ్రిటీల జీవితాలు ఉండవు అన్న విషయం తెలిసిందే. తెరమీద మేకప్ వేసుకొని ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపించిన సెలబ్రిటీలు నిజజీవితంలో మాత్రం అందరి లాగానే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక స్థాయికి ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంకా ఎంతో మంది నుంచి అవమానాలు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 ఒకప్పుడు సినిమా హీరో హీరోయిన్లు కెరియర్ తోలినాళ్లలో ఎదురైన అనుభవాల గురించి పెద్దగా బయటకు చెప్పేవారు కాదు. ఒకవేళ బయటకు చెబితే తమ కెరియర్ ఎక్కడ పాడవుతుందో అని భయపడేవారు. ఈ క్రమంలోనే అన్ని సీక్రెట్ గానే ఉంచేవారు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఎంతోమంది హీరోయిన్లు కెరియర్ తొలినాళ్లల్లో  ఎదురైన చేదు అనుభవాల గురించి అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకోవడానికి ఎంతో ముందుకూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా సినీ  సెలబ్రిటీలు చెబుతున్న విషయాలు ఇంటర్నెట్లో సంచలనంగా సృష్టిస్తూ ఉంటాయి.

 అయితే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న దీపిక పదుకొనే అటు హాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే హాలీవుడ్ కెరియర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. హాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తొలి దశలో చీకటి రోజులు  అనుభవించాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. హాలీవుడ్కు వెళ్ళినప్పుడు చాలా భయం వేసింది. నాకు తెలిసినవారు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా ఫీలయ్యాను. అది ఒక చీక.టి అధ్యాయంగా మిగిలిపోయింది ఇండియాలో నేను స్టార్ హీరో అయినా అక్క మాత్రం కెరియర్ మళ్ళీ కొత్తగా మొదలుపెట్టినట్టు అనిపించింది. ఇక ఏం ఆలోచించకుండా నా పని నేను  చూసుకుంటూ సక్సెస్ అయ్యాను అంటూ ప్రియాంక చోప్రా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: