అలాంటి వారితో ఇష్టపూర్వక సెక్స్ కూడా అత్యాచారమే : కోర్టు

praveen
ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అయితే మహిళలను వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే సమయం సందర్భం చూసుకుని.. తమలో ఉన్న మృగాన్ని బయటకు తీసుకు వస్తున్న ఎంతో మంది మగాళ్లు చివరికి ఆడవాళ్ళ జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు. ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు అని చెప్పాలి.

 ఇంకొంతమంది అయితే ఏకంగా మతిస్థిమితం లేని వారిని కూడా వదలకుండా దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలా అత్యాచార ఘటనల్లో అటు కోర్టులు కూడా సంచలన తీర్పులు ఇస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల ఒక కేసు పై కూడా సంచలన తీర్పును వెల్లడించింది ముంబై కోర్టు. మతిస్థిమితం లేని మహిళతో ఇష్టపూర్వకంగానే శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడు ఒక వ్యక్తి. అయితే ఇటీవల ఆ మహిళ గర్భం దాల్చింది. దీంతో ఇక వీరి సంబంధం కు సంబంధించిన విషయం బయటకు వచ్చింది. దీంట్లో ఆ మతిస్థిమితం  లేని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఈ క్రమంలోనే ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక దర్యాప్తు చేపట్టి అన్ని ఆధారాలతో నిందితుని కోర్టులో సబ్మిట్ చేశారు. అయితే మహిళ సమ్మతితోనే తాను శారీరక సంబంధం పెట్టుకున్నాను అంటూ సదరు వ్యక్తి వాదించాడు. అయితే ఈ విషయంపై కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతిస్థిమితం సరిగ్గా లేని మహిళల సమ్మతితో చేసే సెక్స్ ను అత్యాచారంగానే పరిగణిస్తాం అంటూ ముంబైలోని సెషన్స్ కోర్టు పేర్కొంది. ఎందుకంటే మతిస్థిమితం లేని వారు ప్రకృతి పర్యవసనాలు అర్థం చేసుకోలేరు అంటూ అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితునికి పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: