ఏపీ :సీపీఐ అలా.. సీపీఎం ఇలా.. కూటమి ఒక నాటకమా..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకుంది.. నేటితో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలను పధకాలతో ఆకట్టుకోవడానికి సరికొత్త స్కీమ్ లను తెరపైకి తెస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా రాష్ట్రంలో ఉచితాలకు డిమాండ్ పెరిగింది. మెజారిటీ ప్రజలు ఏ హామీని అయితే ఎక్కువగా ఇష్టపడతారో అది మానిఫెస్టోలో చేరిపోతుంది.అధికారంలోకి వచ్చాక ఆ హామీ నెరవేరుతుందా లేదా అనేది మాత్రం చెప్పలేని పరిస్థితి.. రాష్ట్రంలో ఎన్నడూ చూడనంతగా సంక్షేమ పధకాలే రాజ్యమేలుతున్నాయి.ప్రస్తుత అధికార పార్టీ గత ఎన్నికలలో ఉచిత పధకాలకు తెర తీసింది. ఫలితంగా ఆ ఎన్నికలలో భారీ విజయం సాధించింది. ఈ సారి కూడా ఆ విధంగా అడుగులు వేసింది. గత ఎన్నికలలో ఇచ్చిన పధకాలనే కొనసాగిస్తూ ఈ సారి వాటి పరిధిని పెంచేలా మేనిఫెస్టోను రూపొందించింది. అయితే దీనికి భిన్నంగా టీడీపీ కూటమి మేనిఫెస్టో ఉండబోతుందని సమాచారం.

 

అయితే రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ప్రస్తుతం పోరు జోరుగా సాగుతుంది. అయితే కొన్ని నియోజకవర్గాలలో వామపక్షాలదే హవా..ఈ సారి వామపక్షాలు అయిన సీపీఐమరియు సీపీఎం కాంగ్రెస్ తో కలిసి కూటమిగా ఏర్పడ్డాయి.. దీనితో ఈ సారి వైసీపీ, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా వామపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే సీపీఐ తరుపున నాయకులు నిత్యం జగన్ చేస్తున్న కార్యక్రమలను విమర్శిస్తూ ముందుకెళ్తుంది.. రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ దౌర్జన్యాలను, అరాచకాలను సృష్టిస్తుందంటూ మండిపడింది. అయితే సీపీఎం దీనికి వ్యతిరేకంగా టీడీపీ కూటమిని విమర్శించడం చేస్తుంది.రాష్ట్రం లో సంక్షేమం వలన ప్రజలు సోమరులు అవుతారన్న టీడీపీ ప్రభుత్వమే ఇప్పుడు సూపర్ 6 ను ఎలా ప్రకటిస్తుంది అని సీపీఎం విమర్శిస్తుంది. అలాగే కాంగ్రెస్, సిపిఐ మాత్రం జగన్ పై విరుచుకుపడుతున్నారు.దీనితో పేరుకే వామపక్ష కూటమికానీ చర్యలు మాత్రం విభిన్నంగా వుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: