వైసీపీకి షాక్‌: ఆ 2 జిల్లాలను టీడీపీ స్వీప్‌ చేస్తుందా?

టీడీపీకి వచ్చే ఎన్నికల్లో 100 నుంచి 120 సీట్లలో గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు అంచనా వేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం టీడీపీకే వస్తుంది. జనసేనకు పోదన్నది వారి అభిమతం. కృష్ణా, గుంటూరు జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ లోని అసంతృప్తుల కారణంగా 10 శాతం సీట్లు, జనసేన గనక కలిస్తే ఆ ఓట్లు చీలకపోతే అవి ఒక 5 నుంచి 10 శాతం, టీడీపీ కి ఉన్న ఓట్ల శాతం అన్ని కలుపుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించి ఆంధ్రలో అధికారం చేపట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేసేస్తోంది.

ఈ సారి ముఖ్యంగా వైసీపీలో టికెట్లు రాని వారు, అక్కడ ఉండి గెలవలేని వాళ్లే టీడీపీ టార్గెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారే వారికి టికెట్ ఇచ్చి.. గెలుపు బాట పట్టించాలని చూస్తున్నారు. ఒక వేళ గతంలో ఆ నియోజకవర్గంలో ఓడిపోయిన వారైతే ఎలా ముందుకు వెళతారన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. టీడీపీ, ఈ సారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేందుకు అనుకూల పవనాలు ఉన్నట్లు చంద్రబాబు కార్యకర్తల్ని ఉత్సహ పరుస్తున్నారు.

నిజమే ఇలా ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్పీప్ అయితే రేపు రాబోయే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే అవుతోంది. 1999 టీడీపీ ప్రభంజనం సమయంలో కాంగ్రెస్ 23 స్థానాలే గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. మళ్లీ అదే సీన్ రీపిట్ అవుతుందని తెలుగు దేశం నాయకులు దృఢంగా నమ్ముతున్నారు. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అప్పటి వరకు ఏ నియోజకవర్గంలో ఎలాంటి మలుపులు వస్తాయో.. ఎవరికి ఎలాంటి లాభం చేకూరుతుంది. ఎవరు గెలుస్తారు.. ఎవరూ ఓడతారన్నది వేచి చూడక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: