తెలంగాణ: రాత్రంతా షాపింగ్.. ఎవరికి లాభం?
రాత్రి పూట షాపులు తీయొచ్చు. వ్యాపారాలు పెరుగుతాయి. సాప్ట్ వేర్ ఇంజినీర్లు, తదితరులు రాత్రి డ్యూటీ అయిపోయాక షాపింగ్ చేయొచ్చు. ఎంచక్కా నైట్ సిటీని ఎంజాయ్ చేయొచ్చు. రెండో వైపు ఇబ్బంది కలిగే విషయం. రాత్రి పూట గాలికి తిరిగే వారికి కూడా అవకాశం కలుగుతుంది.
షాపుల్లో పని చేసే వారికి కూడా ఇబ్బంది కలుగుతుంది. గుమస్తాలు, వర్కర్లకు కూడా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంది. రాత్రి డ్యూటీలు వేస్తే చేయలేని పరిస్థితి వస్తుంది. ఈ నైట్ డ్యూటీల వల్లనే సాప్ట్ వేర్ ఇంజినీర్లు నిద్రలేకుండా గడిపి ఆరోగ్యాలు పాడవుతున్నాయని బాధపడుతుంటారు. మనిషికి కావాల్సింది రాత్రి నిద్ర. ఆ సమయంలో నిద్రపోతే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు ఇలా తీసుకొచ్చిన విధానం వల్ల షాపులు తెరుచుకోవడం ఏమో కానీ గాలికి తిరిగేవారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు.
చంద్రబాబు ప్రవేశపెట్టినా విధంగా నైట్ బజార్ లు పెడితే బాగుంటుంది. కానీ ఇలా మొత్తం షాపులు తీయడం అనేది కాస్త ఇబ్బంది కలిగించేదే. ఒంటి గంట వరకు ఛాన్స్ ఇస్తే ఒకే. కార్పొరేట్ వ్యవస్థకు, షాపింగ్ కాంప్లెక్స్ ల వ్యవస్థకు ఇది పనిచేస్తుంది. కానీ కార్మికులకు, ఇతరులకు ఇది పనికి రాదు. ఇలా పదివేలు ఎక్కువ కట్టించుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయన్ని పెంచుకోవాలని అనుకోవడం ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ దాని వల్ల ఏర్పడే దుష్పరిణామాలను ప్రభుత్వం ముందుగా అంచనా వేయాలి. దాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించాలి. ఈ ఉత్తర్వులు వల్ల ఏ మేరకు ప్రభుత్వానికి లబ్ధి కలుగుతుందో చూడాలి.