చైనా.. అలీబాబాను సర్వ నాశనం చేసేసిందా?
అది కూడా ఆయన మాట్లాడిన ఒక్క మాటను అడ్డుపెట్టుకొని చేసుకొచ్చాడు ఆయన. ఓవరాల్ గా చూసుకుంటే ఆలీబాబా గ్రూపుని ఆరు యూనిట్లుగా డివైడ్ చేశారు. డానియల్ జెన్ సీఈవో అధికారకంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విడివిడిగా ఐపిఓల కోసం, అంటే పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. 24 సంవత్సరాల ఆలీబాబా చరిత్రలో మొదటిసారి, 24 శాతం అమెరికాలో, 13 శాతం హాంకాంగ్ లో షేర్లు పెరిగిన నేపథ్యంలో మేము ఎంత డెవలప్ చేసామో చూశారా అని చైనా కమ్యూనిస్టులు గొప్పగా చెప్పుకొచ్చారు.
కానీ అసలు విషయాన్నీ వీళ్ళు దాచిపెట్టారు. అలీబాబా గ్రూపు కి సంబంధించి 2.8 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి రీపే చేయాల్సిన అవసరం ఉంది. టోటల్ గా చూసుకుంటే దీని ఇంపాక్ట్, ఎట్లాంటి పరిస్థితి అంటే జాక్మా మాయమైపోయిన తర్వాత దీని ఆదాయ వనరులు అంటే దీని కెపాసిటీ 250 మిలియన్ డాలర్లకు పడిపోయింది.
అంటే యాక్చువల్ గా దాని దగ్గర ఉన్న ఆస్తి ఎంతయ్యా అంటే 250 మిలియన్ డాలర్లు. యాక్చువల్ గా ఆలీబాబా ఉండే రోజుల్లో 850 మిలియన్ డాలర్లు అయితే ఇప్పుడు దాని కెపాసిటీ 1/4 వంతు పడిపోయింది. ఆలీబాబా షేర్లు 70 శాతానికి పడిపోయాయి. ఇప్పుడు అది 10-16%పెరిగితే మేము పారిశ్రామికవేత్తలకి ఎంత ప్రోత్సాహం ఇస్తామో చూసారా అంటున్నారు చైనా కమ్యూనిస్టులు.