ఇదే పని బాబు చేస్తే భజన ఓ రేంజ్‌లో ఉండేది కదా?

బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవచ్చు. ఒక వేళ మా ఆవిడకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అసంతృప్తులకైతే బాలినేని ఒక స్పష్టత నిచ్చారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వంలో ఎక్కువ చోటిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో నాకు కాకుండా మా ఆవిడకు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని అన్న నేను చేసేదీ ఏమీ లేదని అన్నారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు కొండెపి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా శారద ఎన్నికయ్యారు. గతంలో వ్యవసాయ మార్కెట్ల చైర్మన్ లలో గతంలో పురుషులు మాత్రమే ఉండే వారు. ప్రస్తుతం మహిళలు కూడా అవుతున్నారని అన్నారు. వైసీపీలో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఛైర్ పర్సన్ గా శారదను ఎంపిక చేశామన్నారు. ఒంగోలు మేయర్ గా కూడా మహిళనే నియమించామని, ఒకవేళ నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ వద్దు భార్యకే ఇస్తామన్న ఏం చేయలేనని నవ్వుతూ అన్నారు.

అసలు ఇది సంచలనం, గందరగోళం ఏదైనా అనొచ్చు. కాని ముఖ్యంగా మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఒకప్పుడు రిజర్వ్ డు సీట్లలోనే మహిళలకు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రస్తుతం జనరల్ సీట్లలో కూడా మహిళలకు వైసీపీ జగన్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇదే విషయంలో చంద్రబాబు చేసి ఉంటే  ఆ ప్రధాన పత్రికలు చంద్రబాబు విజన్ అని, ఎన్టీఆర్ కి బీసీలంటే ఎనలేని అభిమానమని ఇప్పటికీ చెబుతారు. ఏదేమైనా జగన్ పురుషుల కంటే మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎన్నికల నాటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: