నో ఛాన్స్‌: ఏపీ ఉద్యోగులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌?

ఏపీ ఉద్యోగులకు ఇది నిజంగా వెరీ బ్యాడ్ న్యూస్.. సీపీఎస్‌ విధానం రద్దవుతుందేమో అన్న ఆశలకు ఏపీ సర్కారు పూర్తిగా గండికొట్టేసింది. సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్రంపై ఆందోళనకరంగా భారం పడుతుందన్న సర్కారు.. ఆ పని చేయలేమని తేల్చి చెప్పింది. అది కాకుండా ఇంకా వేరే అంశాలపై చర్చించాలని కోరింది. ఉద్యోగికి నష్టం జరగకుండా జీపీఎస్ లో చర్యలు తీసుకున్నామంటున్న జగన్ సర్కారు.. ప్రభుత్వానికి,ఉద్యోగికి ప్రయోజనం ఉండేలా మధ్యే మార్గంగా గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం తెచ్చామని చెబుతోంది.

ఉద్యోగి కి కుటుంబానికి భద్రత కల్పించడం  ప్రభుత్వ కనీస భాధ్యత అంటున్న జగన్ సర్కారు.. ఉద్యోగి రిటైర్ అయ్యాక మినిమం పదివేలు పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్ లో మార్పులు చేశామని ఉద్యోగులకు నచ్చ జెబుతోంది. ఉద్యోగి  రిటైర్ అయినా వైద్య బీమా కొనసాగించాలని నిర్ణయించామని.. ఉద్యోగి చనిపోతే ప్రమాదబీమా కల్పించేలా చర్యలు తీసుకున్నామని.. ఉద్యోగి చనిపోయినా ...భార్యకు  పెన్షన్ అందించేలా సవరణలు చేశామని జగన్ సర్కారు చెబుతోంది.

ఉద్యోగులకు ఒపీఎస్ ఇచ్చే పరిస్థితి లేనేలేదని తేల్చి చెప్పిన వైసీపీ సర్కారు..  సీపీఎస్ రద్దు చేస్తే ప్రభుత్వానికి  మోయలేని బరువు అవుతుందని అభిప్రాయపడుతోంది. ఉన్నంతలో బెటర్ గా  ఉన్నదాన్ని తాము ఇస్తున్నామంటున్న జగన్ సర్కార్‌.. ఉద్యోగులకు ఇంతకన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఖరాఖండీగా చెప్పేసింది. ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కేలా జీపీఎస్ తీసుకువచ్చి చర్యలు తీసుకున్నామని.. జీపీఎస్ పై ఉద్యోగులు  మరిన్ని సూచనలిస్తే స్వీకరిస్తామని జగన్ సర్కార్‌ అంటోంది.

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనంటున్న జగన్ సర్కార్‌... శాంతిభద్రతల సమస్యల దృష్ట్యా వారిపై పోలీసులు కేసులు పెట్టారని.. పోలీసు చర్యల వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే కేసుల ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది. మొత్తానికి తాజా చర్చలతో ఉద్యోగులకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నది లేనే లేదు.. ఏది ఏమైనా ఇంకాస్త బెటర్ ఆప్షన్లపై చర్చించి.. ఏదో ఒకటి ఖాయం చేసుకోవాల్సిందే అన్న విషయం ఉద్యోగులకు అర్థమైంది. మరి వారు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: