కల్కి Vs ఇండియన్: వెరీ బిగ్ ఫైట్?

Purushottham Vinay
పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. క్రియేటీవ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టాలీవుడ్ సీనియర్ నిర్మాత అశ్విని దత్ తెరకెక్కిస్తున్నారు.ఇండియన్ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశం తో హాలీవుడ్ రేంజ్ లో వస్తున్న ఈ మూవీ కోసం మేకర్స్ ఏకంగా రూ.600 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అ అంచనాలని మరింత పెంచేసింది.ముందుగా ఈ మూవీని మే 9న థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కారణంగా జూన్ 27కు పోస్ట్ పోన్ చేస్తూ అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త కంగారుపడుతున్నారు. మాములుగా కల్కి లాంటి భారీ సినిమాలు లాంగ్ వీకెండ్ సెట్ అయ్యేలా రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే.. బడ్జెట్ బాగా ఎక్కువ కాబట్టి రికవరీ ఈజీగా అవుతుందని అలా ప్లాన్ చేస్తారు. కానీ, కల్కి సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ అలాంటి ప్లాన్ చేయడం లేదు.


మాములు రిలీజ్ లాగే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జూన్ 27 అంటే గురువారం సినిమా రిలీజ్ అవుతుండగా.. తరువాత వీకెండ్ తప్పా ఎలాంటి స్పెషల్ హాలీడేస్ ఏమీ లేవు. కాబట్టి వర్కింగ్ డేస్ లోనే ఆడియన్స్ థియేటర్స్ కి రావల్సి ఉంటుంది. సినిమాకు ఒక రేంజ్ లో హిట్ టాక్ వస్తే తప్పా.. వర్కింగ్ డేస్ లో థియేటర్స్ కి పెద్దగా రారు.అందుకే ఫ్యాన్స్ భయపడుతున్నారు. పైగా ఇదిలా ఉంటే ఈ సినిమాకి పోటీగా అదే రిలీజ్ డేట్ నాడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది. 1996 లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన భారతీయుడు సినిమాకి కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కుతుంది. అందువల్ల ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి చూడాలి ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకి రికార్డ్ వసూళ్లు వస్తాయో ఏ సినిమా చరిత్ర సృష్టిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: