జగన్.. ఈ ఇష్యూని ఇంత చెత్తగా డీల్‌ చేశారేంటి?

ప్రభుత్వ పాలనలో లోపాలు సహజం.. సమస్యలు సహజం.. ఆ సమస్యలు తలెత్తినప్పుడు ఎలా డీల్ చేస్తామన్నది ప్రధానం.. తాజాగా జాంగారెడ్డి గూడెం నాటుసారా మరణాల విషయాన్ని డీల్ చేయడంలో  జగన్ టీమ్‌ అట్టర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తోంది. జంగారెడ్డి గూడెం పరిసరాల్లో నాటుసారా తాగడం వల్ల దాదాపు 20 మంది వరకూ చనిపోయినట్టు మొదట్లో వార్తలు వచ్చాయి. జగన్ అంటే పీకలదాకా కోపం ఉన్న టీడీపీ అనుకూల మీడియా ఇలాంటి ఇష్యూ దొరికితే రచ్చ రచ్చ చేయకుండా ఊరుకుంటుందా..? ఆ సమస్యే లేదు.

ఇక్కడా అదే జరిగింది.. జంగారెడ్డి గూడెంలో మీడియా మోహరించి.. అక్కడి స్థానికుల మాటల్లోనే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టింది. జగన్ రెడ్డి ఈ మద్యం అమ్మకాలు నిషేధిస్తే చాలు.. మాకు ఏ ఇతర పథకాలూ వద్దు..  మేం ఆటోమేటిగ్గా కోటీశ్వరులం అయిపోతాం అని అక్కడి మహిళలు చెబుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో సున్నితమైన విషయాన్ని సున్నితంగానే డీల్ చేయాల్సి ఉంటుంది.

పొరపాటు జరిగింది.. ఇది ఎలా జరిగిందో చూస్తాం.. దీని మీద విచారణ జరిపిస్తే.. నాటు సారా విక్రయాలు జరగనీయం అంటూ మంత్రి భరోసా ఇచ్చి.. సారా మృతులు కుటుంబాలకు ఎంతో కొంత పరిహారం ప్రకటిస్తే.. ఇష్యూ సున్నితంగానే క్లోజ్ అయ్యేది.. అలా కాకుండా.. అబ్బే.. చనిపోయిన వారు సారా తాగడం వల్లే మరణించలేదు.. అవన్నీ సహజ మరణాలు అంటూ ఎదురు దాడి చేసే ప్రయత్నమే బెడిసి కొట్టింది.

ఏ ప్రాంతంలోనైనా 2 శాతం సహజంగానే మరణాలు ఉంటాయి అని సీఎం సమర్థించుకోవాలని చూడటం విశేషం.. ఇక సీఎం స్వయంగా ఇలా అంటే జగన్ మంత్రులు ఊరుకుంటారా.. అబ్బే.. అసలు నాటుసారాతో మరణిస్తే కేసు నమోదు కాదా అంటూ ఓ మంత్రి ప్రశ్నించారు. పాపం.. ఆయన అలా అడిగిన 24 గంటల్లోనే అక్కడ కేసులు కూడా నమోదయ్యాయి. జంగారెడ్డి గూడెం పరిసరాల్లో నాటుసారా అమ్మకం దారులు, తయారీ దారులపై పోలీసులు కేసులు కూడా పెట్టారు. ఇలా జగన్ టీమ్ స్వయంగా టీడీపీకి, దాని అనుకూల మీడియాకు ఓ బ్రహ్మాస్త్రం అందించినట్టయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: