తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబునాయుడు రచ్చ రచ్చ చేసేశారు. ఉపఎన్నిక భవిష్యత్తు ఫలితం తాలూకు ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో కనబడుతోంది. రోడ్డుషోలో భాగంగా ఆయన మాట్లాడుతున్నపుడు ఓ రాయివచ్చి పడిందట. దాంతో చేసిన రచ్చ మామూలుగా లేదు. ఎవరిమీదో రాయిపడితే అంటే ఎవరిమీద కూడా రాళ్ళు పడినట్లు ఎవరు చెప్పలేదు. ఎక్కడో ఓ కార్యకర్త మీద రాయివచ్చిపడిందట. ఆ రాయిని ఎవరు ఎవరిమీదకు విసిరారో కూడా సదరు కార్యకర్త చెప్పలేకపోయారు. తమపై రాళ్ళు పడుతున్నాయని కార్యకర్తలు చెబుతున్న సమయంలోనే ఓ కార్యకర్త తనపై రాయిపడిందని చూపించారట. వెంటనే ఆ రాయిని తీసుకుని అందరికీ చూపిస్తు తనపై రాళ్ళదాడి జరిగిందని చంద్రబాబు గంగవెర్రులెత్తిపోయారు. చంద్రబాబు తీరుచూసిన తమ్ముళ్ళందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఎవరో కార్యకర్త మీద రాయిపడితే ఆ రాయేదో తనపైనే పడినట్లు, రాళ్ళవర్షం కురిపస్తున్నారని ఆరోపిస్తు నానా గోల గోల చేసేశారు. వాహనంలో నుండి దిగిపోయి రోడ్డుపైనే కూర్చుండిపోయారు. ఎస్పీ, కలెక్టర్ వచ్చి తనతో మాట్లాడేంతవరకు రోడ్డుపై నుండి లేచేది లేదంటు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో అక్కడ ఏమి జరుగుతోందో మామూలు జనాలకు అర్ధమేకాలేదు. మొత్తానికి ఓ 40 నిముషాల తర్వాత అక్కడి నుండి లేచి వెళిపోయారు. అయితే చంద్రబాబు ఇక్కడ గోలచేస్తున్న సమయంలోనే అమరావతిలో పార్టీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు దిగినట్లు రాతమూలకంగా ఫిర్యాదు చేశారు. సరే వరుసగా ఒకరితర్వాత మరొకరుగా చాలామంది సీనియర్ నేతలు ప్రభుత్వం+పార్టీపై నోటికొచ్చినట్లు ఆరోపణలతో బురదచల్లేశారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే అసలు రాళ్ళుపడ్డాయా లేదా అన్నది కూడా డౌటే. తనమీద రాయిపడిందని, పలానా వాళ్ళు విసిరారని కూడా సదరు కార్యకర్త చెప్పలేదు. కొందరు కార్యకర్తలు రాళ్ళదాడి గురించి చంద్రబాబుకు చెప్పారు. అదే సమయంలో తనపై రాయిపడిందని మరో కార్యకర్త రాయిని చూపిచారంతే. దాన్నిపట్టుకుని చంద్రబాబు రచ్చ రచ్చ చేసేశారు. అంటే జరిగింది జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబులో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ అర్ధమైపోతోంది. గెలుపు అవకాశం లేదని స్పష్టమైపోయింది. గెలుపు కాదుకదా కనీసం పోయిన ఎన్నికల్లో వచ్చిన 4.94 లక్షల ఓట్లయినా వస్తాయా అన్నదే డౌటుగా మారిపోయింది. అప్పుడొచ్చిన ఓట్లు కూడా ఇపుడు రాకపోతే తీరని అవమానం. ఇందులో నుండి బయటపడిందే ఈ ఫ్రస్ట్రేషన్.