హెరాల్డ్ ఎడిటోరియల్ : జైలు నుండి విడుదల కాగానే మొదలైన శశికళ రాజకీయం

Vijaya
జైలు నుండి విడుదలైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెల్లి, వ్యక్తిగత సహాయకురాలు శశికళ అప్పుడే ఏఐఏడిఎంకేలో కంపు మొదలుపెట్టేశారు. జైలు నుండి విడుదలైన నెచ్చెలి బెంగుళూరుకి శివార్లలో ఉన్న ఓ రిసార్ట్స్ కు చేరుకున్నారు. ఆసుపత్రి నుండి డిస్చార్జి అయిన శశికళ రిసార్ట్స్ కు వెళ్ళిన వాహనానికి ఏఐఏడిఎంకే జెండా ఉండటంతో ఆమె మద్దతుదారులు ఆశ్చర్యపోయారు. దానికితోడు సోమవారం ఉదయం రిసార్ట్స్ లో తన మద్దతుదారులతో ఆమె మాట్లాడుతూ ఏఐఏడిఎంకేకు ఇప్పటికీ తానే ప్రధాన కార్యదర్శిగా ఆమె ప్రకటించుకున్నారు. దీంతో పార్టీలో శశికళ కంపు రాజకీయాలు మొదలుపెట్టినట్లే. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.


ఎప్పుడైతే ఆమె జైలు పాలయ్యారో వెంటనే ఏఐఏడిఎంకే ముఖ్యనేతలంతా కలిసి ఆమెను పార్టీనుండి బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ శెల్వంతో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలు, పార్టీ సీనియర్ నేతలంతా కలిసి తీసుకున్న బహిష్కరణ నిర్ణయమది. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసు.  ఏఐఏడిఎంకేలో తన ప్రస్తానం ముగిసిందన్న నిర్ణయంతోనే తన  మేనల్లుడు దినకరన్ తో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) అనే కొత్త పార్టీని పెట్టించారు ఆమె. అయితే ఆ పార్టీని రాష్ట్రంలో  దేకేవాడే కరువయ్యారట. ఎటూ వచ్చే మే నెలలోగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ పరిస్ధితుల్లో తన పార్టీ జనాల్లో ఆదరణ ఉండదన్న విషయం శశికళకు అర్ధమైనట్లుంది.


అందుకనే ఎలాగైనా మళ్ళీ ఏఐఏడిఎంకేను చేజిక్కుంచుకోవాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. అందుకనే పార్టీకి తానే జనరల్ సెక్రటరీని అంటూ పంచాయితి మొదలుపెట్టారు. సరే తానే పార్టీకి  ప్రధాన కార్యదర్శి అని ఆమె అనుకుంటే సరిపోతుందా ? ఎలాగూ ఏఐఏడిఎంకే అధికారంలో ఉంది కాబట్టి పార్టీ ఆఫీసు మెట్లను కూడా ఆమెను ఎక్కనివ్వరన్నది వాస్తవం.  ముందుజాగ్రత్తగా జయలిలత నివసించిన ‘వేదనిలయం’ ను ప్రభుత్వం ఓ మ్యూజియంగా మార్చేసింది కాబట్టి అందులోకి కూడా శశికళ ప్రవేశించే అవకాశం లేదు. కాకపోతే ఇపుడు మొదలుపెట్టిన కొత్త పంచాయితి కారణంగా అసలే బలహీనంగా ఉన్న ఏఐఏడిఎంకే మరింత బలహీనపడటం మినహా ఉపయోగం లేదు. అంటే తనకు కాకుండా పోయిన పార్టీని ఇంకెవ్వరికీ కాకుండా చేయాలని శశికళ కంకణం కట్టుకున్నట్లున్నారు. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: