బీజేపీ, జనసేన రాసుకుంటే బూడిదేనా?

ఏపీలో ఎన్నికల ముఖచిత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు.వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో ఏ పార్జీ జట్టు కడుతుందన్నదానిపై స్పష్టత రావడం లేదు. జనసేనను తనవైపు లాక్కోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. కానీ జనసేన ఇప్పటికే బీజేపీని తన మిత్ర పక్షంగానే చెబుతోంది. మరి ఈ మూడు పార్టీలు కలసి నడుస్తాయా అన్న అంశంపైనా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తుపై  
పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి  సెటైర్లు వేశారు.

సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుందన్నట్లు.. బిజెపి జనసేన రాసుకుంటే అదే జరుగుతుందని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. బిజెపి రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహం పార్టీ ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి  తెలిపారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి తెలియదు కానీ మోసాల ప్యాకేజీ ఇచ్చిందని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి  అన్నారు.

కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికిందని..  దుగ్గరాజుపట్నం ఓడరేవు ఊసే లేదని.. పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేసిందని.. పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి  మండిపడ్డారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్  ప్రస్తావనే లేదని.. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల అడ్రస్ లేదని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి  అన్నారు.  మన్నవరం ప్రాజెక్టును మూసివేసిందని.. ఆంధ్ర బ్యాంకు ను కాలగర్భంలో కలిపిందని ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టిందని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి  మండిపడ్డారు.

అలాంటి బిజెపితో పొత్తు కోసం జనసేన పాకులాడడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. జనసేన బిజెపి బి టీమ్స్ తప్ప మరి ఏమి కాదని రాష్ట్రంలో బిజెపి పరిస్థితి గొర్రె తోక బెత్తెడే అన్నట్లుగా ఉందని పీసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు.
గత ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారని తులసి రెడ్డి  ఆరోపించారు... ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారని ఆయన కూడా పార్టీ మారారని తులసి రెడ్డి గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: