రహస్యం.. అమరావతిపై జగన్ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారా?
రివర్ బెడ్ రివర్ బేసిన్ మధ్య తేడా తెలుసుకోవాలని జగన్‌కు సూచించారు. వాస్తవాలు తెలియకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని నారాయణ హెచ్చరించారు. గతంలో జగన్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిని నిలిపివేసి మూడు రాజధానుల విధానాన్ని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సర్కారు అమరావతిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరోసారి రాజుకుంది.
రెండో విడత భూసమీకరణకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు. గంటల వ్యవధిలోనే వందల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారని ఆయన చెప్పారు. అమరావతి ముందుకు సాగిపోతోందన్న దుగ్ధతో జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి నిర్మాణం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
గతంలో చంద్రబాబు నాయుడు అమరావతిని జగన్-ప్రూఫ్ చేయడానికి పార్లమెంట్ ద్వారా చట్టపరమైన రక్షణ కోరారని తెలుస్తోంది. రాష్ట్రానికి శాశ్వత రాజధాని కావాలని ఆయన లక్ష్యం. మూడు రాజధానుల ప్రతిపాదనతో జగన్ అమరావతిని రద్దు చేయాలని చూశారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి అభివృద్ధి మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు డెడ్‌లైన్ పెట్టారు. రూ.52 వేల కోట్లతో నిర్మాణాలు సాగుతున్నాయి. విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్‌గా మార్చాలని ప్రణాళికలు రూపొందుతున్నాయి.
9490520108.. ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ నియోజకవర్గాల్లో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.