మళ్లీ గబ్బర్ సింగ్ మార్క్ ను ఫాలో అవుతున్న హరీష్ శంకర్... రిస్కేనా..?
గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో రౌడీలతో హీరో చేయించిన హంగామా థియేటర్లలో అభిమానులు , ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా చేసింది. ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు అదే ప్యాట్రన్ ఫాలో అయ్యారు కానీ హరీష్ శంకర్ మార్కుని టచ్ చేయలేకపోయారు. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్లీ అంత్యాక్షరి సీన్ ఎపిసోడ్ ని ఒక మోడల్ టచ్ ఇచ్చి సరి కొత్తగా డిజైన్ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. కేవలం పాటలు డాన్సులతోనే సరిపెట్టుకోకుండా వినోదంతో పాటు ఇందులో మరికొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నట్లు సమాచారం.
డైరెక్టర్ హరీష్ శంకర్ కి పాత మ్యాజిక్ ను రిపీట్ చేయడం పెద్ద సవాల్ అయినప్పటికీ, ఈసారి అంతకుమించి ఉండేలా పక్కా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే వింటేజ్ పవన్ కళ్యాణ్ ని గుర్తుచేసేలా ఈ సీన్స్ ఉండబోతున్నాయట. పవన్ కళ్యాణ్ మేనరిజం మీద డైరెక్టర్ హరీష్ శంకర్ కి పూర్తి పట్టు ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్ వంటి సినిమా సీన్స్ ఎంత నేచురల్ గా పండించారో ఇప్పుడు భగత్ సింగ్ సినిమాలో కూడా అదే స్థాయిలో వినోదాన్ని పండించడానికి చిత్రబృందం చాలా శ్రమిస్తోందట. ఒకవేళ ఈ ఎపిసోడ్ వర్కౌట్ అయితే మాత్రం ఈసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా 26 మార్చి 2026న విడుదల కాబోతోంది.