మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ మీనాక్షి.. పెద్ద బ్యానర్లలో వరుస ఆఫర్లు!
2024, 2025, 2026 సంక్రాంతి సీజన్లలో వచ్చిన చిత్రాలు మీనాక్షి క్రేజ్‌ను మరింత పెంచాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు వంటి వరుస విజయాలతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇలా వరుస విజయాలతో మీనాక్షి పేరు టాలీవుడ్లో మార్మోగిపోతోంది. దర్శక, నిర్మాతలు ఆమెను తమ ప్రాజెక్టుల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌తో మీనాక్షి అనుబంధం ప్రత్యేకంగా మారింది. ఇప్పటికే ఈ సంస్థలో మూడు సినిమాలు చేసిన ఆమెకు నాలుగో అవకాశం కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీ హీరోగా ఈ బ్యానర్లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేతో పాటు మీనాక్షి చౌదరి పేరు కూడా పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే సితార బ్యానర్లో మీనాక్షి నాలుగోసారి నటించే అవకాశం ఉంటుంది.
మీనాక్షి కేవలం సితార బ్యానర్‌కే పరిమితం కాలేదు. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న మోస్ట్ బిజీ హీరోయిన్ ఆమే.: మీనాక్షి కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు, తెలుగు డైలాగులు స్పష్టంగా చెబుతూ ఆడియన్స్‌కు దగ్గరవుతోంది.ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా.. తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు మీనాక్షి ఓకే చెప్పేస్తోంది. ఆటిట్యూడ్ లేకుండా దర్శకుల హీరోయిన్గా పేరు తెచ్చుకోవడమే ఆమెకు ఈ రేంజ్ లో ఆఫర్లు రావడానికి కారణం. అందుకే ఇప్పుడు ఆమెను టాలీవుడ్ "మోస్ట్ బిజీయెస్ట్ బ్యూటీ" అని పిలుస్తున్నారు.సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్లో నాలుగో సినిమా అంటే అది మామూలు విషయం కాదు. ఈ ఏడాది మీనాక్షి డైరీ ఫుల్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఈ భామ మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.