రాజా సాబ్ హిందీ వర్షన్ కు మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా అన్ని కోట్ల కలెక్షన్స్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులు అయినటువంటి నీది అగర్వాల్ , మాలవికా మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ రోజు అనగా జనవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న రాత్రి అనగా జనవరి 8 వ తేదీనే చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు.


ఇకపోతే ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే పెద్ద మొత్తం లో కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రభాస్ నటించిన ఎన్నో సినిమాలు హిందీ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్న విషయం మన అందరికి తెలిసిందే. దానితో హిందీ మార్కెట్లో కూడా ప్రభాస్ కి అద్భుతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే రాజా సాబ్ మూవీ ని కూడా హిందీ లో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. రాజా సాబ్ మూవీ హిందీ వర్షన్ కి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అద్భుతమైన కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజా సాబ్ మూవీ హిందీ వర్షన్ కు ఫైనల్ గా డే 1 కి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపు 3.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి గనుక హిందీ ఏరియాలో మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమాకు హిందీ ఏరియా నుండి అద్భుతమైన కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: