టార్చ్‌బేర‌ర్‌..  జ్యోతి బాపూలే...

Spyder

అవును ఈ ప‌దం అక్ష‌రాల మ‌హాత్మ‌ జ్యోతిరావు ఫూలేకు అతికిన‌ట్లు స‌రిపోతుంది. అప్ప‌టి వ‌ర‌కు మూఢ‌న‌మ్మ‌కాలు... అంధ‌విశ్వాసాల‌తో అణ‌గారిపోతున్న స‌మాజానికి కొత్త‌దారి చూపాడు. చూప‌డ‌మే కాదు...వేలు ప‌ట్టి న‌డిపించాడు.. చ‌దువు ప్ర‌తీ ఒక్క‌రూ హ‌క్కు అని నిన‌దించాడు. దానికి జాతి, లింగ‌, కుల వివ‌క్ష చూప‌డంపై అంతులేని పోరాటం. భార‌త‌దేశంలో సామాజిక సంస్కరణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టిన మొద‌టి మ‌హోన్న‌తుడ‌నే  చెప్పాలి. ఆయన  భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీబా ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు  పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. 


ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848 లో పూనాలో ప్రారంభించారు. ఆయన వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించాడు. ఇక అగ్ర‌వ‌ర్ణాలు పెట్టిన క‌ట్టుబాట్ల‌ను ఉల్లంఘిస్తూ స్త్రీ జాతి మ‌హోద్ద‌ర‌ణ‌కు కృషి చేశారు. బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.  కుల విధానంలో ఆయన బ్రాహ్మణులను విమర్శించడమే కాకుండా సమాజంలో వారి ఆధిపత్యాన్ని వ్యతిరేకించాడు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు.  సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే గ్ర‌హించాడు.  స్త్రీ విద్యాభివృద్ధితోనే స‌మాజాభివృద్ధి సాధ్య‌మ‌ని బ‌లంగా న‌మ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 

 

1848 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారిని కూడా బోధించవలసిరావడంతో ముందు ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు. నాటి స‌మాజంలో మూఢ ఆచారాలైన క‌న్యాశుల్కం, బాల్య వివాహాలకు వ్య‌తిరేకంగా పోరాటాలు చేశాడు. త‌న‌లాంటి ఆలోచ‌న‌లు క‌లిగి ఉన్నవారంద‌రిని ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి స‌మానాకి ఒక కొత్త మార్గాన్ని చూపాడు. చిన్న వ‌య‌స్సులో వితంతువులుగా మారిన వారికి  స్వయంగా వివాహాలు జరిపించాడు.  1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించాడు. 

 

1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్ట మొదటి సంస్కరణో ద్యమం. శూద్రులను బ్రాహ్మణ చెర నుంచి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ సభ్యులు పురోహితుల అవసరం లేకుండానే దేవుణ్ణి పూజించేవారు. ఫూలే త‌న ర‌చ‌న‌ల ద్వారా కూడా స‌మాజాన్ని మేల్కొల్పారు. దీనిలో బ్రాహ్మణీయ అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రులపెై బ్రాహ్మణీయుల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు.  బ్రహ్మసమాజం తదితర బ్రాహ్మణీయ సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు. 1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది.  ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు.  ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు  అని పేర్కొన్న ఆయ‌న చివ‌రి శ్వాస వ‌ర‌కు స‌మాజాన్ని సంస్క‌రింంచారు.  మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. జ్యోతి బాపూలే  

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: