పాములకు పాలు పోసి పెంచుతున్న పాక్?

frame పాములకు పాలు పోసి పెంచుతున్న పాక్?

Chakravarthi Kalyan
ఇండియా ప్రధాని విదేశాలకు వెళ్లి వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రాజెక్టులపై సైన్ చేస్తారు. అందులో ప్రాజెక్టులో భాగంగా ఎలా ముందుకెళ్లాలి. ఎవరిని సంప్రదించాలి. ఏయే కంపెనీలు వస్తే ఇండియాకు లాభం చేకూరుతుంది. ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి. వాటి వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభం ఏమిటి? ఇలా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకుంటారు.


రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా దేశానికి వచ్చే ప్రాజెక్టులు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది. తమకు ఎంత మేర లాభం చేకూరుతుంది. భవిష్యత్తులో ఆ కంపెనీ వల్ల ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది తదితర అంశాలను చూసుకుంటూ పని చేస్తారు. దీని వల్ల యువతకు ఉపాధి దొరికి వారి జీవితాలు బాగు పడటమే కాక వారి కుటుంబాల జీవనం మెరుగుపడుతుంది. సమాజంలో వారికంటూ ప్రత్యేకంగా జీవించ గలుగుతారు.


ఇలా ఇండియానే కాదు ప్రపంచ దేశాలు వివిధ రకాల ఉపాధి చూపెడుతూ యువతను సన్మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాకిస్థాన్ ఒక్కటే తమ దేశ యువతకు ఉగ్రవాదం వైపు మళ్లించడానికి వారికి తీవ్ర వాద శిక్షణను ఇప్పించి తద్వారా వారిని ఉగ్రవాదులుగా మార్చే ప్రక్రియ చేస్తోంది. ఇలా చేయడం వల్ల తాను అనుకున్నది సాధించవచ్చని అనుకుంటోంది. దేశంలోకి యువతను సన్మార్గంలో నడిపి ముందు కెళ్లాల్సిన అధికారులే వివిధ కంపెనీల పేరుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. పెరట్లో పెంచుకుంటున్న పాము విజిటర్లను మాత్రమే కరుస్తుందననే రకం పాకిస్థాన్ అధికారులది.


కానీ అది విష సర్పం అని దానికి అందరూ సమానులే అని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి కొన్ని ఉగ్రవాద శిక్షణ నిచ్చే ముఠాలను పాకిస్థాన్ లో తీసుకొచ్చారు. అవే టీఆర్ఎఫ్, జేఖేఎప్, గాజ్వీ ఫోర్స్, కేటీ, ఎల్ ఈఎం అనే ఉగ్రవాద తయారీ కంపెనీలు. ఈ సంస్థలు యువతను ఉగ్రవాదులుగా మార్చడానికి శిక్షణ ఇస్తారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు శిక్షణ ఇస్తారు. ఇలా తయారైంది పాకిస్థాన్ పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: