ఒంటరిగా వెళుతున్న బాలిక.. వెంబడించిన తాగుబోతు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఆడపిల్ల ధైర్యంగా ఇంటి నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే మంచి వాళ్ళలా ప్రవర్తిస్తున్న మనుషులు మానవ మృగాలుగా మారిపోయి ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు పక్కనే కుటుంబ సభ్యులు ఉన్న వారిపై దాడి చేసి మరి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు నీచులు.

 అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు అటు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన.. కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో గల్లీలో ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న ఒక బాలికపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చివరికి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఇదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. కాన్పూర్ లోని రావత్పూర్ లో ఈ ఘటన వెలుగు చూసింది  మద్యం షాపు వద్ద ఫుల్లుగా తాగి మత్తులో ఉన్న వ్యక్తి బాలిక వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు.

 బాలిక సమీపంలో ఉన్న దుకాణంలో కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఘటన జరిగింది. వెనకనుంచి వచ్చి గట్టిగా పట్టుకుని అరవకుండా నోరు మూసేసి కింద పడేసి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. కానీ బాలిక గట్టిగా అరుస్తూ ప్రతిఘటించడంతో చివరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన సంచలనంగా మారగా.  పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: