సీట్ బెల్ట్ పెట్టుకోలేదని.. ట్రాక్టర్ డ్రైవర్ కు చలాన్?

praveen
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రోడ్డు ప్రమాదాలను నివారించాలి అంటూ ఇక ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు. ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. ఎంత దారుణమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అన్న విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రాదు. ఇటీవల కాలం లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారుల విషయం లో అధికారులు కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నారు.


 ఒకప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించక పోతే కాస్త చూసి చూడనట్లుగా వ్యవహరించే అధికారులు ఇప్పుడు ఎవరైనా రూల్స్ అతిక్రమించారంటే  భారీగా జరిమానాలు విధించడం లాంటి చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఇలా జరిమానాలు విధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నామ్. మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏకంగా ఇంటికి ట్రాఫిక్ చలానా పంపిస్తూ ఉన్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం చలాన్లు వేయడం విషయంలో అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి వింత అనుభవం ఎదురయింది. ఏకంగా ట్రాక్టర్ పై వెళ్తుండగా సీట్ బెల్ట్ లేదు అంటూ పాల్వంచ పోలీసులు ట్రాఫిక్ చలాన్ విధించారు. అదేంటి ట్రాక్టర్కు సీట్ బెల్ట్ ఉంటుందా అనే అనుమానం మీకు  కలిగింది కదా..  నిజంగానే ట్రాక్టర్కు సీట్ బెల్ట్ ఉంటుందా అని అనుమానం అతనికి కూడా కలిగింది. వెంటనే షోరూం కి ఇదే విషయం అడగడానికి ఫోన్ చేస్తే ఇక షో రూమ్ వాళ్ళు ట్రాక్టర్కు సీట్ బెల్ట్ ఉండదు అని చెప్పారని సదరూ వాహన యజమాని తెలిపారు. మరి ట్రాఫిక్ పోలీసులు దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: