వామ్మో.. ఇదెక్కడి తీర్పు.. అక్రమ సంబంధం తప్పు కాదట?

praveen
ఇటీవల కాలం లో మానవ బంధాలకు పూర్తిగా విలువ లేకుండా పోయింది అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎందుకంటే నేటి రోజుల్లో అలాంటి దారుణ ఘటనలు వెలుగు లోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా మానవ బంధాలు బంధుత్వాలకు విలువ ఇవ్వని మనుషులు.. క్షణకాల సుఖం కోసం నీచమైన పనులు చేస్తూ ఉన్నారు. కట్టుకున్న వారిని కడుపున పుట్టిన వారిని కాదని ఏకంగా అక్రమ సంబంధాలకు తెర లేపుతున్న ఘటనలు చాలానే వెలుగు లోకి వస్తున్నాయ్.

 అయితే ఇలా అక్రమ సంబంధాల కారణం గా ఎన్నో కాపురాలు కూలి పోతున్నాయ్. ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇంకొంతమంది హత్యకు కూడా గురవుతున్నారు. ఇంత జరుగుతున్న పరిస్థితుల్లో మాత్రం మార్పు రావట్లేదు.  కట్టుకున్న వారిని కాదని పరాయి వ్యక్తులు మోజులో పడిపోయి ఏకంగా అక్రమ సంబంధాలకు తెర లేపుతున్నారు. అయితే ఇలా అక్రమ సంబంధాల విషయంలో  ఏదైనా కఠినమైన చట్టం తీసుకొస్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నా సమయంలో.. ఇటీవల రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం సంచలనంగా మారిపోయింది.

 ఒక రకంగా అక్రమ సంబంధం తప్పు కాదు అన్నట్లుగా తీర్పును ఇచ్చింది రాజస్థాన్ హైకోర్టు. ఇద్దరు మేజర్లు ఏకాభిప్రాయంతో వివాహేతర శృంగారం చేస్తే అది నేరంగా పరిగణించలేము అంటూ తెలిపింది. తన భార్యను ముగ్గురు కిడ్నాప్ చేశారని భర్త కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టులో హాజరైన భార్య ముగ్గురిలో ఒకరితో తాను సహజీవనం చేస్తున్నాను అంటూ తెలిపింది. అయితే వివాహేతర సంబంధం చేస్తున్న ఆమెను శిక్షించాలి అంటూ భారత తరపు న్యాయవాది కోరగా.. ఆమె చేసిన పనిని నేరంగా పరిగణించలేము అంటూ రాజస్థాన్ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: