సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దన్నందుకు.. ఆ బాలిక ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ అనేది మనిషి జీవితంలో ఎంతలా భాగంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం మనిషి అవసరాలు మాత్రమే తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు ఆ మనిషినే బానిసగా మార్చేస్తుంది. ఆరంగులాల మొబైల్ ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పాలి. అయితే ఇక మొబైల్ లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్న మనిషి బయట ప్రపంచంతో ఉన్న సంబంధాలను తెంచుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. పక్కన ఎంత మంది స్నేహితులు ఉన్నా.. మొబైల్ లో ఎక్కడో ఉన్న స్నేహితులతో మాట్లాడటానికి ఆసక్తిని కనబడుతూ ఉన్నారో జనాలు.

 ఇలా ప్రతిక్షణం ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా.. మొబైల్ వాడుతూ చివరికి బానిసలుగా మార్చేస్తూ ఉన్నాడు. ఇక నేటి రోజుల్లో మనిషి జీవితంలో ఎక్కువ సమయం దేనికి కేటాయించారు అని చూస్తే కేవలం మొబైల్ కి కేటాయించిన సమయం మాత్రమే కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఇక మొబైల్ కి బానిసగా మారిపోతున్న మనుషులు.. చివరికి ఈ మొబైల్ కోసమే ప్రాణాలను సైతం తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులు చిన్న పిల్లలను ఇక మొబైల్ వాడొద్దు అంటూ తల్లిదండ్రులు మందలిస్తే చివరికి మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎంతో మందికి కడుపుకోతను మిగులుస్తున్నాయ్. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.

 మొబైల్ ఎక్కువగా వాడొద్దు అని కూతురిని తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన 14 ఏళ్ల బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. స్థానిక ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీలో ఉంటున్న 14 ఏళ్ల బాలిక ఎక్కువగా సెల్ఫోన్ ఉపయోగిస్తుంది. దీంతో ఇది గమనించిన తండ్రి ఫోన్ వాడొద్దని ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక రూమ్ లోకి వెళ్లి తలుపు వేసింది  క్షణికావేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో తల్లితండ్రులు అరణ్యరోదనగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: