రోగిని చితకబాదిన ప్రభుత్వ డాక్టర్.. ఎంత దారుణంగా కొట్టాడో చూడండి?

praveen
కరోనా తర్వాత డాక్టర్లపై అందరి అభిప్రాయం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే డాక్టర్లు అంటే కొంతమందికి పెద్దగా గౌరవం ఉండేది కాదు. కానీ కరోనా వైరస్ సమయంలో అందరూ ఇంటిపట్టునే ఉండి ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటే.. డాక్టర్లు మాత్రం ఫ్యామిలీ బాధ్యతలను సైతం వదిలేసి ఏకంగా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు నడుం బిగించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కోట్లాదిమంది ప్రాణాలు కరోనా లాంటి సంక్షోభం సమయంలో నిలబడ్డాయి అంటే కేవలం డాక్టర్ల పుణ్యమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

 ఇలా కరోనా తర్వాత డాక్టర్లే ప్రత్యక్ష దైవం అని ఎంతోమంది నమ్మడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే డాక్టర్లకు అమితమైన గౌరవం కూడా ఇస్తున్నారు అని చెప్పాలి. అయితే కొంతమంది వైద్యులు మాత్రం ఏకంగా డాక్టర్ మృతికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన రోగుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం వచ్చిన ఒక రోగిపై డాక్టర్ పిడిగుద్దులతో రెచ్చిపోయాడు. దారుణంగా దాడి చేశాడు. కాలితో తన్నుతూ కింద పడేసాడు. ఆ తర్వాత రెండు చేతులు పట్టుకొని రూమ్ బయటికి లాక్కు వెళ్ళాడు. ఇందుకు సంబంధించి సిసి టీవీ లో రికార్డ్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆకాష్ ఉపాధ్యాయ అనే రోగి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యం కోసం డాక్టర్ ఆర్.పి సింగ్ ను సంప్రదించాడు. అయితే చీటీ పైన మందులు ఏం తీసుకోవాలో రాసిన డాక్టర్ బయట కొనుక్కోవాలని చెప్పాడు. అయితే రోగి మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మందులు బయట కొనమని డాక్టర్ చెప్పడం ఏంటని నిలదీసాడు. దీంతో ఆగ్రహించిన డాక్టర్ ఆర్.పి.సింగ్ తన కుర్చీ నుంచి లేచి వచ్చి ఏకంగా రోగి ఆకాష్ ను కొట్టాడు. కింద పడేసి కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత రూమ్ నుంచి బయటకు లాక్కు వెళ్ళాడు. అయితే ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్.. ఏకంగా దర్యాప్తు చేయడంతో పాటు రోగిని కొట్టిన డాక్టర్ ఆర్పి సింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: