ఇదెక్కడి మతిమరుపు సామీ.. పరీక్ష పెట్టడం మరచిపోయిన యూనివర్సిటీ?

praveen
ప్రస్తుతం ఎగ్జామ్స్ సీజన్ నడుస్తుంది. ఎక్కడ చూసినా ఇక విద్యార్థులందరూ కూడా ఎక్సమ్ ఫీవర్ తో తెగ వణికి పోతున్నారు అని చెప్పాలి. ఇక అందరూ పుస్తకాల పురుగుల్లా మారిపోయి తెగ చదివేస్తున్నారు. ఈ క్రమంలోనే బట్టి పట్టాలని కొంతమంది.. సబ్జెక్టును అర్థం చేసుకొని ఇక పరీక్షల్లో టాప్ ర్యాంక్స్ సంపాదించాలని ఇంకొంతమంది  ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎగ్జామ్స్ లో కాపీయింగ్ చేసి చివరికి దొరికిపోయి డిబార్ అవుతున్న విద్యార్థులు కూడా ఇంకొంతమంది ఉన్నారు.

 ఇలా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎగ్జామ్స్ ఫీవర్ నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇలా పరీక్షలకు సంబంధించి ఏ విషయం తెల మీదికి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఘటన అయితే మరింత విచిత్రమైనది. ఇప్పటివరకు పరీక్షల సమయంలో ఎంతో మంది విద్యార్థులు ఏదో ఒక కారణం చెప్పి ఎగ్జామ్స్ ఎగ్గొట్టడం ఎన్నోసార్లు చూశాము. ఇలా పరీక్షలను ఎగ్గొట్టిన విద్యార్థులు ఆ తర్వాత సప్లమెంటరీ రాసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం ఏకంగా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఎగ్గొట్టింది. అర్థం కాలేదు కదా. ఏకంగా యూనివర్సిటీ అటు ఎగ్జామ్స్ నిర్వహించడం మర్చిపోయింది.

 ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు అని చెప్పాలి. యూనివర్సిటీ ఇలా విచిత్రంగా పరీక్ష పెట్టడం మర్చిపోవడం ఏంటి అని షాక్ అవుతున్నారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. రాణి దుర్గావతి యూనివర్సిటీలో ఎంఎస్సీ పరీక్షలకు సంబంధించిన టైం టేబుల్ ప్రకటించడం జరిగింది. హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. కానీ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్ష నిర్వహించడం యూనివర్సిటీ అధికారులు మరిచిపోయారు. దీంతో విద్యార్థులు సైతం షాక్ అయ్యారు. అయితే ఈ ఘటన సంచలనంగా మారగా.. దీనిపై అధికారులు విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: