విడ్డూరం కాకపోతే మరేంటి.. ఈ కారణానికి కూడా విడాకులు తీసుకుంటారా?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ అటు వైవాహిక బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే వేరువేరు పరిస్థితుల మధ్య పెరిగిన ఇద్దరు మనుషులు ఒకచోట వందేళ్లపాటు కలిసి బ్రతకడం అనేది వైవాహిక బంధం. అంతే కాదు కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ సంతోషకరమైన జీవితాన్ని గడపడమే దాంపత్య బంధం. కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే మనస్పర్ధలతో విడిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 కొన్ని ఘటనల్లో అయితే ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు మనుషులు దేనితో ఇలాంటి ఘటనలు  అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి. అయితే ఇలాంటి తరహా ఘటనలు పెళ్లి పై నేటి యువతలో ఉన్న భావనను పూర్తిగా మార్చేస్తూన్నాయ్. పెళ్లి చేసుకోవడం కంటే బ్యాచిలర్ గా ఉండడం బెటర్ అనే ఆలోచనకు ఇక ఇలాంటి ఘటనలు కారణమవుతున్నాయ్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా చీర భార్యాభర్తల విడాకులకు కారణమైంది. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.

 ఆగ్రాకు చెందిన దీపక్ అనే వ్యక్తికి ఎనిమిది నెలల క్రితం ఆత్రాస్ జిల్లాకు చెందిన మహిళతో వివాహం జరిగింది. అయితే ప్రతిసారి కూడా తనకు నచ్చిన చీరనే కట్టుకోవాలి అంటూ భార్యను డిమాండ్ చేస్తూ ఉండేవాడు భర్త. ఈ క్రమంలోనే తనదే అప్పర్ హ్యాండ్ అన్న విధంగా వ్యవహరించేవాడు. కానీ భార్య మాత్రం ఇందుకు నిరాకరిస్తూ ఉండడంతో రోజు వీరి మధ్య గొడవ జరుగుతూ ఉండేది. ఇక ఇటీవల ఏకంగా ఒకరిపై ఒకరు పోలీసులకు కూడా ఫిర్యాదులు చేసుకున్నారు. ఇద్దరం కలిసి జీవించాలని ఉన్నప్పటికీ.. చీర సమస్య పరిష్కరించడం కష్టతరం అవుతుంది అని భావించిన ఆ భార్యాభర్తలు చివరికి విడాకులు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: