కారు డిక్కీలో రూ.9 లక్షల పెట్టాడు.. కానీ చివరికి?

praveen
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్లాలన్న కాస్త విలాసవంతమైన ప్రయాణం ఉండాలని అనుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే కార్లను కొనుగోలు చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే ఇలా కారు కొనుగోలు చేసి ప్రయాణాలు సాగించేవారు. కానీ ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు సైతం తమ హోదాకి తగ్గట్లుగా ఇక ఏదో ఒక కార్ ను కొనుగోలు చేయడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా కారు కొనుగోలు చేసిన వారు ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే చారు లగేజీ మొత్తం కార్ డిక్కీలో పెట్టేస్తూ ఉంటారు. లగేజీ మాత్రమే కాదు అన్ని రకాల వస్తువులను కూడా డిక్కీలో పెట్టడం చూస్తూ ఉంటాం.

 కానీ ఏకంగా డబ్బుని డిక్కీలో పెడతారా అంటే డబ్బును డిక్కీలో పెట్టడమేంటి కాస్త జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటారు కానీ.. డిక్కీలో పెట్టడం ఏంటి అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా డిక్కీలో డబ్బులు పెట్టాడు. 1,2 లక్షలు కాదు ఏకంగా తొమ్మిది లక్షల రూపాయలను తన కారులో పెట్టాడు. సరే పెట్టి జాగ్రత్తగా ఉన్నాడా అంటే అది లేదు ఏకంగా కార్లో డిక్కీలో డబ్బులు పెట్టి ఒక ఫంక్షన్కు వెళ్లాడు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. ఇక ఈ తంతు మొత్తం పూర్తయిన తర్వాత గాని అతనికి కారులో డబ్బులు పెట్టాను అన్న విషయం గుర్తు రాలేదు. వెంటనే ఈ విషయం గుర్తు రావడంతో అతను ఇక కార్ దగ్గరికి వెళ్లి డిక్కీ తెరిచి చూశాడు. కానీ ఒక్కసారిగా షాక్. ఎందుకంటే డిక్కీలో పెట్టిన డబ్బు మొత్తం మాయం అయిపోయింది.

 ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ముసారాం బాగ్ డివిజన్ సలీంనగర్లో వెలుగులోకి వచ్చింది. రాజ్ కుమార్ కేడియా అనే 50 ఏళ్ల వ్యక్తి పని నిమిత్తం గురువారం మధ్యాహ్నం 9 లక్షల రూపాయలను తీసుకొని కారు డిక్కీలో పెట్టాడు. అనంతరం సమీప బంధువు పెళ్లి వేడుకకు హాజరయ్యాడు సదరు వ్యక్తి. తిరిగి మధ్యాహ్నం నగదు విషయం జ్ఞాపకం రావడంతో ఇక డిక్కీ తెరిచి చూశాడు. కానీ అందులో అతను పెట్టిన నగదు పెట్టి మాత్రం కనిపించలేదు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: