బోన్ లోకి వెళ్లి.. సింహం ముందే తొడగొట్టాడు.. చివరికి?

praveen
సాధారణంగా అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది అంటే ప్రతి ఒక్కరు కూడా సింహం పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే అడవికి రారాజుగా పిలుచుకునే సింహం భారీ ఆకారం ఉన్న ఏనుగును సైతం కుంభస్థలంపై పంజా విసిరి ఆహారంగా మార్చుకోగలదు. అలాంటి ఏనుగు ఇక ఏదైనా జంతువుపై కన్నేసింది అంటే చాలు ఆ జంతువుకు అదే చివరి రోజు అవుతుంది అని చెప్పాలి. అత్యంత క్రూరంగా వెంటాడి వేటాడి మరీ చంపుతూ ఉంటుంది  సింహం. అందుకే సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఏకంగా మనిషి సింహం ముందుకు వెళితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రేయ్. పులిని దూరం నుంచి చూడాలి అనిపించింది అనుకో, చూస్కో .. పులితో ఫోటో దిగాలి అనిపించింది అనుకో, కొంచం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేసుకోవచ్చు. సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం, వేటాడేస్తది అని జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో చెప్పిన డైలాగ్ ఇక ఇప్పుడు జరిగిన ఘటనకు సరిగ్గా సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నది పులికి బదులు సింహం. అదొక్కటే తేడా. ఏకంగా ఒక వ్యక్తి సింహం బోన్ లోకి  వెళ్లి తొడగొట్టేసాడు. ఇంకేముంది నా ముందే తొడగొడతావా అని ఒక్కసారిగా పంజా విసిరిన సింహం.. నిమిషాల వ్యవధిలో అతని ప్రాణాన్ని గాల్లో కలిపేసింది. ఈ ఘటన తిరుపతి ఎస్వి జూలో చోటుచేసుకుంది.

 అందరి లాగానే ఈ జంతు ప్రదర్శనశాల సందర్శనకు వచ్చిన ఒక యువకుడు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏకంగా సెల్ఫీ కోసం సింహం ఎన్ క్లోజర్ లోకి దూకాడు. అంతటితో ఆగకుందా ఏకంగా రారా చూసుకుందాం అన్నట్లుగా సింహం ముందే తొడగొట్టాడు. ఇంకేముంది అతని తీరు చూసి సింహానికి చిర్రేత్తుకొచ్చింది. ఒక్కసారిగా అతనిపై దూకేసింది. ఇక అతను సింహం నుంచి తప్పించుకునేందుకు చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ సింహం అతడి పై దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీసేసింది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. అయితే జూ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఎవరో విలువరాలు తెలియాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: