జిపిఎస్ మ్యాప్ ను గుడ్డిగా ఫాలో అయింది.. చివరికి?

praveen
నేటి ఆధునిక యుగంలో మనిషిని టెక్నాలజీ శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ప్రతి పని విషయంలో కూడా టెక్నాలజీ మీద అవసరానికి మించి ఆధారపడిపోతున్నాడు మనిషి. అయితే ఇలాంటి టెక్నాలజీ కారణంగా ప్రతి పని కూడా ఎంతో సులభతరం అవుతుంది అని చెప్పాలి. దీంతో ఒకప్పుడు చెమటోడ్చి చేసే పనులన్నీ ఇక ఇప్పుడు ఒక్క చుక్క చెమట చిందించకుండానే పూర్తి చేసేస్తూ వున్నాడు మనిషి. అంతలా టెక్నాలజీ మనిషి జీవనశైలిని ఎంతో సింపుల్ గా మార్చేసింది.

 వేసుకునే చెప్పులు దగ్గర నుంచి తినే ఆహారం వరకు టెక్నాలజీని ఉపయోగించుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ కూర్చున్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నాడు మనిషి. అదే సమయంలో ఇక ఎక్కడికైనా తెలియని చోటుకు వెళ్తున్నప్పుడు ఎక్కువగా టెక్నాలజీ సహాయంతో గూగుల్ మ్యాప్స్ పై ఆధారపడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలియని ప్రాంతాలకు వెళుతూ ఉంటే రోడ్డు పక్కన ఎవరైనా కనిపిస్తే వారిని అడ్రస్ అడుగుతూ ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు జిపిఎస్ మ్యాప్ ఆన్ చేసుకుని ఎవరిని అడగకుండానే వాహనంపై దూసుకుపోతున్నారు ప్రతి ఒక్కరు.

 కానీ ఇలాంటి అలవాటు కొన్ని కొన్ని సార్లు ప్రమాదంలో పడేస్తుంది. ఏకంగా జిపిఎస్ మ్యాప్ వాహనదారులు ప్రమాదంలో పడే పరిస్థితికి కారణమవుతుంది. ఇలా జిపిఎస్ మ్యాప్ ను గుడ్డిగా ఫాలో అయ్యి ప్రమాదంలో పాడిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది  జిపిఎస్ మ్యాప్ ను నమ్మి ఓ మహిళ చిక్కులో పడింది. థాయిలాండ్ కు చెందిన పాసర ఇంచాన్ మన్ మహిళా తన గమ్యాన్ని చేరుకునేందుకు జిపిఎస్ మ్యాప్ సూచనలు పాటిస్తూ బయలుదేరింది  అది చూపిన మార్గంలో వెళ్లిన కారు పాదచారుల కోసం నిర్మించిన వంతెన పై వెళ్ళింది. దీంతో భయాందోళనకు గురైన ఆమె కేకలు వేయడంతో అటుగా వెళుతున్న వారు ఆమెను కాపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gps

సంబంధిత వార్తలు: