భర్త రహస్యంగా రెండో పెళ్లి.. విషయం తెలిసాక భార్య ఏం చేసిందో తెలుసా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఏకంగా కష్టసుఖాల్లో పాలుపంచుకొని మనసును అర్థం చేసుకునే భాగస్వామి వస్తే బాగుండు అని యువతి యువకులు ఇద్దరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఏకాకిక సాగిపోతున్న జీవితానికి తోడు నీడను ఇస్తూ ఉంటుంది పెళ్లి అనే బంధం. అయితే ఒక్కోసారి మూడుముళ్ల బంధంతో ముడిపడిన తర్వాత వారిని విడదీయడం చాలా కష్టం అని ఒకప్పుడు పెద్దలు చెప్పేవారు. కానీ నేటి రోజుల్లో పెళ్లి అనేది కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మాత్రమే మారిపోయింది. చాలామంది కట్నం  కోసమే పెళ్లి చేసుకుంటున్నారు.

 అయితే అటు అమ్మాయిలు కూడా తక్కువేం కాదు. మంచి ఉద్యోగం వ్యాపారం ఉన్న వాడిని మాత్రమే చూసుకుంటూ..  పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఒకవేళ గవర్నమెంట్ జాబు ఉంది అంటే చాలు కళ్ళు మూసుకొని పెళ్లికి ఓకే చెబుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా జరుగుతున్న పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదు. కొంతమంది ఏకంగా పెళ్లయిన కొన్నాళ్లకే భార్యతో విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకొంతమంది భార్య బ్రతికుండగానే కనీసం విడాకులు కూడా ఇవ్వకుండానే.. రెండో పెళ్లి చేసుకుని కట్టుకున్న భాగస్వామిని మోసం చేసేందుకు రెడీ అవుతున్నారు.

 ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా భర్త తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు అని ఆ భార్య ఎంతగానో మనస్తాపం చెందింది. దీంతో చివరికి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్లోని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న లక్ష్మీగూడా లో వెలుగు చూసింది. ధర్మేంద్ర, వేణు దేవి దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది . అయితే ఇటీవల మొదటి భార్యకు తెలియకుండా ధర్మేంద్ర రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం వేణు దేవికి తెలియడంతో మనస్థాపంతో చివరికి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటన పై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: