ఇప్పటికైనా మారండి.. పండగ పూటే ముగ్గురి ప్రాణాలు పోయాయ్?

praveen
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ఊరువాడ అని తేడా లేకుంటే అంత పండగ వాతావరణం నెలకొంటుంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇక చిన్న పెద్ద అందరు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగలను సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ఏకంగా రంగుల రంగుల రంగువల్లులు ఎప్పుడు ఫ్యాషన్ దుస్తుల్లో కనిపించే యువతి యువకులు ఇక సాంప్రదాయ వస్త్ర ద్రావణాలలో కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి. హరిదాసు కీర్తనలు పిండి వంటకాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండుగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 అయితే సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా గాలిపటాలను ఎగరవేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గాలిపటాలను ఎగరవేయడంతో ఇక ప్రతి సంక్రాంతి పండుగకు ఎన్నో విషాదకర ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. చైనా మాంజను వాడొద్దు అని అటు అధికారులు ఎంతల అవగాహన కల్పిస్తున్న.. జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. వెరసి చైనా మాంజా కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇంకా ఎంతో మందికి ప్రాణాల మీదికి వస్తుంది.

 కేవలం మనుషులు మాత్రమే కాదు పక్షులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ చూస్తున్నా జనాల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇక ఇటీవల పండుగ పూట తెలుగు రాష్ట్రాల్లో విషాదకర  ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ లో చైనా మాంజా దారం మెడకు తగిలి ఆర్మీ ఉద్యోగి కోటేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు. జోగిపేటలో గాలిపటం ఎగరేస్తున్న ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం కరెంట్ షాక్ తగిలి మరణించాడు. అచ్చంపేటలో గాలిపటం ఎగరేస్తూ ఉండగా గాలిపటం ఎగరవేస్తూ ఉండగా జోహేబ్ అనే వ్యక్తికి కరెంట్ షాక్ తగలడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మరణించాడు. ఇలా ఏకంగా నిర్లక్ష్యంగా చైనా వాడటంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: