సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త?

praveen
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగల్లో సంక్రాంతి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ లో అయినా కాస్త తక్కువగా సెలబ్రేషన్స్ చేసుకుంటారెమో గానీ.. అటు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రలో మాత్రం సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి. కోళ్ల పందాలు ఇక ఈ సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ఇక ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారందరూ కూడా ఇక సొంతూరుకు చేరుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక ఆందోళన నుంచి ఎంతోమంది అటు ఉద్యోగాలు వ్యాపారాలు నిమిత్తం హైదరాబాద్ వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటివారు సంక్రాంతి పండక్కి ఊరు వెళ్తూ ఉంటారు. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఎక్కడ చూసినా ఇలా సొంతూరికి బయలుదేరిన ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.

 అయితే ఇలా సంక్రాంతి పండుగ కోసం పట్టణాల నుంచి సొంతూర్లకు వెళ్తున్న వారందరికీ కూడా అధికారులు తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే అందరూ సొంతూర్లకు వెళుతున్న నేపథ్యంలో  తాళం వేసి ఉన్న ఇళ్లని టార్గెట్గా చేసుకొని దొంగలు చోరీలకి పాల్పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతికి ఊరు వెళ్తున్న వారికి పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. విలువైన వస్తువులు డబ్బులను ఇంట్లో ఉంచకుండా లాకర్లలో భద్రపరచాలి అంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సొంతూరుకి వెళ్తున్నాం అని పోస్టులు పెట్టొద్దు అంటూ సూచిస్తున్నారు. ఇక ఇలా ఊరికి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి అంటూ సూచిస్తున్నారు. అంతా జరిగిపోయిన తర్వాత బాధపడకుండా ముందే ముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని పోలీసులు సూచిస్తూ ఉండడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: