జైల్లో ఖైదీకి కడుపు నొప్పి.. ఆసుపత్రికి తీసుకెళ్లి టెస్టులు చేస్తే డాక్టర్లే షాక్?

praveen
సాధారణంగా జైల్లో ఎంతోమంది ఖైదీలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను చాలామంది పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో ఉన్న జైళ్ళలో అతిపెద్ద జైలు ఏది అంటే చంచల్ కూడా జైలు అని చెప్పవచ్చు. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లోని పాతబస్తీలో ఈ జైలు ఉంటుంది. ఇందులో వందల మంది కాదు ఏకంగా వేల మంది ఖైదీలు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇదే జైల్లో 21 ఏళ్ళ సోహెల్ అనే ఖైదీ కూడా జైలు శిక్షణ అనుభవిస్తున్నారు.

 అయితే ఇటీవల అతను ఉన్నట్టుండి తీవ్రమైన కడుపునొప్పితో కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇక జైల్లో ఉన్న ప్రాథమిక వైద్యులు చికిత్స చేసిన ఫలితం లేకపోవడంతో ఎస్కార్ట్ పోలీసులు సోహెల్ ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షలు చేసిన తర్వాత రిపోర్టులు చూసి డాక్టర్లు ఒక్కసారిగా కంగు తిన్నారు అని చెప్పాలి. ఎందుకంటే సోహెల్ ఎక్స్ రే పరిశీలించగా.. ఏకంగా కడుపులో షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు ఇతర చిన్నపాటి వస్తువులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 అయితే ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉంది అని అనుమానంతో వాటిని డాక్టర్లు ల్యాబ్ కు పంపించారు అని చెప్పాలి. ఇక ఎండోస్కోపీ ద్వారా ఎంతో విజయవంతంగా ఆ ఖైదీ కడుపులో ఉన్న వస్తువులను కూడా బయటికి తీయగలిగారు వైద్యులు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే సదరు ఖైది ఎందుకు ఎప్పుడు ఆ వస్తువులను మింగాడు అన్న విషయాన్ని మాత్రం పోలీసులు అడిగిన వెల్లడించలేదు. ఈ క్రమంలోనే అతనికి మానసికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఇక వైద్యులు పరీక్షలు చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: