కాకి చేసిన పనికి.. ఆ కుటుంబానికి పది రోజులు నిద్ర పట్టలేదట.. ఏం జరిగిందంటే?

praveen
కాకి ఓ బంగారు కంకణం కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇలాంటి కథలు వినడానికి బాగానే ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లో జరిగితే మాత్రం ఊహించని రీతిలో చేదు అనుభవాలను మిగులుస్తూ ఉంటాయి అని చెప్పాలి. అచ్చంగా ఇలాంటి తరహా ఘటన కేరళలోని కోజికోడ్ కాప్పాడులో చోటుచేసుకుంది. ఏకంగా కాకి చేసిన పనికి 10 రోజులపాటు నిద్రాహారాలు మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాప్పాడుకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఫాతిమా హైప తన బంగారు కంకణాన్ని గొలుసును పోగొట్టుకుంది. అయితే అది ఓ చెట్టు పైనున్న గూడులో దొరికింది. నివాస ప్రాంగణంలో కొబ్బరి చెట్టుపై ఉన్న కాకి గూడు నుంచి ఆరు గ్రాముల బంగారు ఆభరణాన్ని కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు.

 ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం వివరాల్లోకి వెళ్లాల్సిందే.. కప్పాడుకు చెందిన నజీర్ కుమార్తె ఫాతిమా పొరుగింటిలో జరిగే పెళ్లికి వెళ్ళింది. అయితే వివాహానికి వెళుతూ వెళుతూ బంగారు కంకణం గొలుసు ధరించింది. ఇక పెళ్లి తర్వాత బాలిక దానిని పేపర్లో ప్యాక్ చేసి బుట్టపైన ఉంచింది.  అయితే ఆమె తల్లి షరీఫాకు చెప్పగా.  ఆమె విషయాన్ని మర్చిపోయింది. ఇక పది రోజుల తర్వాత మరో బంధువు ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కుటుంబ సభ్యులు ఆ కంకణం గొలుసు కోసం వెతకగా.. అవి మాత్రం కనిపించలేదు. ఇల్లు మొత్తం వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. అయితే వారి ఇంటి ప్రాంగణంలో ఉన్న కొబ్బరి చెట్టు కింద ఉన్న వ్యర్ధాలు గొలుసు దొరికింది.

 ఈ క్రమంలోనే ఒక కుటుంబ సభ్యులకి కొబ్బరి చెట్టు మీద ఉన్న ఒక కాకి గూడు కనిపించింది. కంకణం ఒకవేళ దానిలో ఉందేమో అని అనుమానంతో నజీర్ అనే బంధువు కొబ్బరి చెట్టు ఎక్కి కాకిగూడును పరిశించగా.. దానిలో కంకణం కనిపించింది. దీంతో ఇక 10 రోజుల నుంచి కంగారుపడుతూ నిద్రాహారాలు అని గోల్డ్ కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు.  కాకి ఏకంగా బంగారాన్ని ఉంచిన ఒక ప్యాకెట్ ఎత్తుకెళ్లి ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: